తాను రొమాన్స్ చేయాలనుకున్న నటుడితో వేరే హీరోయిన్ రొమాన్స్ చేయడంతో.. ఆ హీరోయిన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందట ఖుష్బూ. మరి ఆ హీరోయిన్ ఎవరో? ఆ హీరో ఎవరో తెలుసుకుందాం.
సాధారణంగా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ కు మధ్య కెమిస్ట్రీ పండితే.. ఆ జోడీని మరోసారి తెరపై చూడాలి అనుకుంటారు ప్రేక్షకులు. ఇక తమ అభిమాన హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని కలలు కంటూ ఉంటారు మరికొంత మంది ముద్దుగుమ్మలు. ఈ క్రమంలోనే కలల హీరో పక్కన నటించే ఛాన్స్ ను మరో హీరోయిన్ కొట్టేస్తే.. ఎక్కడా లేని కోపం వస్తుంది మరికొంత మంది హీరోయిన్స్ కు. నాకూ అలాగే కోపం వచ్చింది అని అంటోంది కోలీవుడ్ స్టార్ హీరోయిన్ ఖుష్బూ. నేను రొమాన్స్ చేద్దాం అనుకున్న హీరోతో.. మరో హీరోయిన్ రొమాన్స్ చేయడం తట్టుకోలేకపోయాను అని, అందుకే ఆ స్టార్ హీరోయిన్ కు ఫోన్ చేసి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పుకొచ్చింది. మరి ఖుష్బూ కలల హీరో ఎవరు? ఆ స్టార్ హీరోయిన్ ఎవరో? ఇప్పుడు తెలుసుకుందాం.
ఖుష్బూ.. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ గా, ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకుంది. ఇక మెుదటి నుంచి ముక్కుసూటిగా మాట్లాడే మనస్థత్వం ఆమెది. కొన్ని రోజుల క్రితం తన తండ్రే తనపై లైంగిక దాడికి గురిచేశాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది ఖుష్బూ. లేటెస్ట్ గా గోపీచంద్ హీరోగా నటించిన ‘రామబాణం’ సినిమాలో కీలక పాత్ర చేశారు ఖుష్బూ. ఈ చిత్రానికి సంబంధించిన ఓ స్పెషల్ చిట్ చాట్ లో ఓ స్టార్ హీరోయిన్ కు ఫోన్ చేసి మరీ వార్నింగ్ ఇచ్చిన విషయం చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా ఖుష్బూ మాట్లాడుతూ.. “నాకు అమితాబ్ అంటే ఎంతో ఇష్టం. ఆయనతో కలిసి నటించాలని, రొమాన్స్ చేయాలని ఉండేది. కానీ నాకు ఆ అవకాశం దక్కలేదు. ఇక చినీకం సినిమాల హీరోయిన్ టబు, అమితాబ్ తో కలిసి రొమాన్స్ చేయడం నాకు నచ్చలేదు. దాంతో ఫోన్ చేసి టబును తిట్టాను” అని చెప్పుకొచ్చింది ఖుష్బూ. అమితాబ్ తో రొమాన్స్ చేస్తే.. నేనే చెయ్యాలి, నువ్వెందుకు చేస్తావ్ అంటూ టబుకు స్వీట్ అండ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందట. బిగ్ బీతో రొమాన్స్ చేసే అర్హతలు నాకు ఒక్కదానికే ఉన్నాయి అంటూ.. బిగ్ బీ పై ఉన్న ప్రేమను వెల్లడించింది ఖుష్బూ. ప్రస్తుతం ఖుష్బూ.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయ్యారు. ఇటు బుల్లితెర కామెడి షో అయిన జబర్దస్త్ కు జడ్జీగా కూడా వ్యవహరిస్తున్నారు. మరి టబుకు ఖుష్బూ వార్నింగ్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.