చిత్రపరిశ్రమలో టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్.. ఇలా ఎన్ని వుడ్ లున్నా.. బాలీవుడ్ పోకడలు మాత్రం మిగితా వాటికి పూర్తి విరుద్ధంగా ఉంటాయి. సౌత్ ఇండస్ట్రీలో సెలబ్రిటీల కొడుకులు, కూతుర్లు పబ్స్, పార్టీస్ అంటూ తిరగడం చూస్తుంటాం. కానీ.. బాలీవుడ్ స్టార్ కిడ్స్ చేసేంత దారుణంగా మాత్రం సౌత్ వాళ్ళు చేయరని చెప్పాలి. ఎందుకంటే.. బాలీవుడ్ అనేది ఇండియన్ మూలాలన్ని పక్కన పెట్టేసి.. పూర్తిగా ఫారెన్ కల్చర్ ని ఫాలో అవుతోంది. ఇప్పుడదే కల్చర్ ని బాలీవుడ్ స్టార్ కిడ్స్ అంతా పబ్స్, నైట్ పార్టీస్ అంటూ అలవాటు చేసుకుంటున్నారు.
రీసెంట్ గా క్రిస్మస్ సెలబ్రేషన్స్ సందర్భంగా ఫ్రెండ్స్ తో పబ్ కి వెళ్లిన స్టార్ కిడ్.. తెల్లారేసరికి తప్పతాగి వార్తల్లో నిలిచింది. ఇంతకీ ఆ స్టార్ కిడ్ ఎవరో కాదు.. స్టార్ హీరో అజయ్ దేవగన్ – కాజోల్ ల గారాలపట్టి నైసా దేవగన్. అవును.. బాలీవుడ్ స్టార్ కిడ్స్ కి కామన్ ఫ్రెండ్ అయిన ఒర్హాన్ అవత్రమణితో కలిసి నైసా తప్పతాగి మీడియా కంటబడింది. క్రిస్మస్ పార్టీ మూడ్ కదా.. మామూలే అనుకోవచ్చు. కానీ, నైసా డ్రెస్సింగ్ స్టైల్, ఫుల్లుగా తాగేసి ఒర్హాన్ చేతిలో చెయ్యి వేసి బయటికి రావడం అంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేశారు. దీంతో స్టార్ హీరో అజయ్ దేవగన్ కూతురు నైసా తప్పతాగిందంటూ కామెంట్స్ చేస్తూ వీడియోని వైరల్ చేస్తున్నారు.
బాలీవుడ్ స్టార్స్ కి, వాళ్ళ పిల్లలకి పార్టీ కల్చర్ కొత్త కాదు. ఇటీవల షారుఖ్ కూతురు సుహానా ఖాన్, జాన్వీ సోదరి ఖుషి కపూర్ లాంటివారు కూడా నైట్ పార్టీస్ లో పాల్గొని వార్తల్లో నిలిచారు. పైగా ఇదే పబ్ లో నైసాతో పాటు మహికా రాంపాల్, ఖుషి కపూర్, సారా సోదరుడు ఇబ్రహీం అలీఖాన్ లు కూడా ఉన్నారని సమాచారం. ఇదిలా ఉండగా.. నైసా వీడియోపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్. పేరెంట్స్ కష్టపడి సంపాదిస్తే.. పిల్లలు ఇలా పబ్స్, పార్టీస్ లో తప్పతాగి వారి పేరు చెడగొడుతున్నారని కామెంట్స్ కొందరు చేస్తున్నారు. ముఖ్యంగా నైసా తన లుక్ పూర్తిగా బోల్డ్ గా మార్చేసిందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి నైట్ పార్టీలో తప్పతాగి బయటికి వచ్చిన నైసా గురించి, బాలీవుడ్ పబ్ కల్చర్ గురించి మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియజేయండి.