చిరంజీవి వీడియో షేర్‌ చేసిన బండ్ల గణేశ్‌..

bandla ganesh chiranjeevi

‘నా పేరు బండ్ల గణేశ్‌- నా దేవుడు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌’ అని చెప్పుకునే బండ్లన్న పేరు మరోసారి వైరల్‌ అవుతోంది. బేసిక్‌ గా నేను పవన్‌ కల్యాణ్‌ భక్తుడిని అని చెప్పుకునే బండ్ల గణేశ్‌ మెగాస్టార్‌ పై ప్రశంల వర్షం కురిపిస్తూ ఈసారి వార్తల్లో నిలిచాడు. విషయం ఏంటంటే.. హైదరాబాద్‌ అమీర్‌ పేట్‌లో యోదా డయోగ్నేస్టిక్స్‌ ప్రారంభోత్సవం జరిగింది. ఆ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, చిరంజీవి, హరీశ్‌రావు, తలసాని, అజహరుద్దీన్‌, గోపీచంద్‌ వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ చిరంజీవి మాట్లాడుతూ సినీ కార్మికుల గురించి ప్రస్తావించాడు. సినిమాకి పని చేసే వారిలో చాలా మంది పేదవారే. వారికి ఇల్లు గడుపుకోవడమే కష్టం. అలాంటిది ఆరోగ్య సమస్య వస్తే ఇంక అంతే. అలాంటి వారి కోసమే చిరంజీవి ఓ రిక్వెస్ట్‌ చేశారు. యోదా డయోగ్నిస్టిక్స్‌ తరఫున ఏదైనా సహాయం చేయగలరా అని ఎంతో విధేయతతో అడిగారు.

అందుకు వెంటనే స్పందంచిన యోదా డయోగ్నిస్టిక్స్‌ సెంటర్‌ వారు ‘మా’ వంటి సినిమాకు సంబంధించిన 24 క్రాఫ్ట్స్ వారు, ఏ యూనియన్‌ అయినా వారందరికీ యోదా డయోగ్నిస్టిక్‌ సెంటర్‌లో 50 శాతం రాయితీ ఇస్తామని సభాముఖంగా ప్రకటించారు. ఆ వీడియోను ట్విట్టర్‌ షేర్‌ చేసిన బండ్ల గణేశ్‌ ‘మీరు సూపర్‌ సార్‌.. మీ గురించి మాటల్లో చెప్పలేకపోతున్నా.. నోట మాట రావట్లేదు’ అంటూ అభిమానాన్ని చాటుకున్నాడు బండ్లన్న. ఆ ట్వీట్‌ బాగా వైరల్‌ అవుతోంది. చిరు రిక్వెస్ట్‌.. యోదా డయోగ్నోస్టిక్స్‌ రిప్లైపై మీ అభిప్రాయాలను కామెంట్‌ చేయండి.