మా ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ టాలీవుడ్ లో హీట్ పెరుగుతోంది. గతంలో మాదిరిగానే పరస్పర విమర్శలు వివాదాలు కొనసాగుతున్నాయి. మొదట అధ్యక్ష పదవికి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ, సీవిఎల్ నరసింహారావు పోటీలో నిలబడుతున్నట్టు ప్రకటించారు. అనూహ్యంగా జీవిత ప్రకాష్ రాజ్ ప్యానల్ లో ప్రత్యక్షం అయ్యారు. దాంతో బండ్ల గణేష్ రంగంలోకి దిగారు జీవిత పై నేను పోటీ చేస్తా అంటూ ఆయన బయటకు వచ్చారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి పోటీ జరగలేదు. ఈసారి మాత్రం ఏకంగా అయిదుగురి పేర్లు తెరపైకి రావడంతో ఈ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. మొన్న మధ్య నరేష్ తన మెంబర్స్ తో ఓ హోటల్ లో కలిసి పార్టీ చేసుకున్నారు. ఇవాళ హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్ లో వారందరికీ ఆయన విందు ఏర్పాటు చేసినట్టు సమాచారం. ‘‘అందరం మాట్లాడుకుందాం. మా లక్ష్యాలపై చర్చిద్దాం. అందరం కలిసి విందు చేద్దాం’’ అంటూ ఓ ఆహ్వాన సందేశాన్ని సినీ కళాకారులకు ప్రకాశ్ రాజ్ టీమ్ పంపినట్లు సమాచారం.
తాజాగా దీనిపై బండ్ల గణేస్ తనదైన స్టైల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాష్ రాజ్ కి పరోక్షంగా కౌంటర్ ఇస్తూ వీడియో బైట్ పోస్ట్ చేశారు. ‘దయచేసి విందులు సన్మానాల పేరుతో మా కళాకారులందరినీ ఒక్క చోటికి చేర్చొద్దు. మీకు ఓట్లు కావాలని అనుకుంటే ఆర్టిస్టులకు ఫోన్ చేసి మీరు చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు వివరించండి. కానీ ఇలా అందరిని ఒక్కచోట చేర్చి వారి జీవితాలతో చెలగాటం ఆడవద్దు’ .. గత రెండేళ్ల నుంచి కరోనా కారణంగా నా లాంటి వాళ్ళు ఎందరో చావుదాకా వెళ్లి వచ్చాం.. అంటూ బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
It’s my humble request 🙏 pic.twitter.com/fFaXAiEK4g
— BANDLA GANESH. (@ganeshbandla) September 12, 2021