లైగర్ టీమ్ తో సందడి చేసిన బాలయ్య.. ఫోటోలు వైరల్!

తెలుగు ఇండస్ట్రీలో బద్రి చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన పూరి జగన్నాథ్ తర్వాత వరుస విజయాలతో దూసుకు పోయాడు. ఇటీవల కాలంలో కాస్త ఫ్లాపులతో సతమతమైన పూరి.. రామ్ హీరోగా తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ మూవీతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఇక అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి చిత్రాలతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించాడు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘లైగర్’ మూవీలో నటిస్తున్నాడు.

liger minపాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా టీమ్‌కు నందమూరి బాలకృష్ణ సర్ప్రైజ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. అయితే బాలయ్య అక్కడ కనిపించడంతో మేకర్స్ తో పాటు విజయ్ దేవరకొండ సైతం ఆశ్చర్యపోయారు. బాలయ్య సినిమా అఖండ సినిమా కూడా గోవాలో షూటింగ్ జరుపుకుంటోంది. దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో “అఖండ” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

AKAGAJG minబ్రేక్ సమయంలో బాలయ్య లైగర్ లోకేషన్‌కు వచ్చి వెళ్లారు. ఒక్కసారే బాలయ్యను చూసి అక్కడ వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు.. అదే సమయంలో తమ అభిమాన హీరో వచ్చాడని తెగ సంబరపడిపోయారు. క గతంలో బాలయ్య హీరోగా పూరి దర్శకత్వంలో “పైసా వసూల్” అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అందరితో సరదాగా ముచ్చటించిన బాలయ్య ఫోటోలకు ఫోజులిచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను కరణ్‌ జోహార్, పూరి జగన్నాథ్, చార్మి, అపూర్వా మెహతా నిర్మిస్తున్నారు.