‘మా’ఎన్నికలపై.. డైరెక్టర్ అజయ్ భూపతి సంచలన ట్విట్!

గత కొన్ని రోజుల నుంచి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపుతున్నాయి. సినీ ప్రముఖులు నిట్ట నిలువునా చీలిపోయారా అనే విధంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ప్రకాశ్ రాజ్-మంచు విష్ణు ల మద్య మాటల యుద్దం కొనసాగుతుంది. అంతే కాదు వీరి ప్యానల్ లో ఉన్న సభ్యులు కూడా ఒకరిపై ఒకరు దారుణంగా ఆరోపణలు.. కేసులు పెట్టుకునే వరకు వెళ్తుంది.

jsdgvasg minఇంతవరకూ ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య వార్ నడిస్తే, ఇప్పుడు కరాటే కళ్యాణి, హేమ మధ్య నడుస్తోంది. లోకల్, నాన్ లోకల్ ప్రచారం జోరుగా సాగుతోంది. బెదిరిస్తున్నారు అని ఒకరు ఆరోపిస్తే, డ్రామాలు చేస్తున్నారని మరొకరు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా ‘మా’ సభ్యులు ఎవరికి అధ్యక్షుడి పట్టం కట్టబెడతారో ఈ అక్టోబర్ 10న జరిగే ఓటింగ్ లో తేలనుంది. తాజాగా “ఆర్ఎక్స్ 100″తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అజయ్ భూపతి. ప్రస్తుతం తన రెండవ ప్రాజెక్ట్ “మహా సముద్రం”తో ప్రేక్షకులను రాబోతున్నారు. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ బాగా ఆకట్టుకుంది.  ఆయన “మా” ఎన్నికలపై ఇన్ డైరెక్ట్ కౌంటర్ వేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. “నాకు నచ్చిన ప్యానల్ కి మద్దతిచ్చిన వారికే క్యారెక్టర్లు రాస్తా…(అని నాతో ఇప్పుడే ఒక డైరెక్టర్ అన్నాడు)” అంటూ సంచలన ట్వీట్ చేశారు అజయ్.

అంతే కాదు ‘ఈ థ్రిల్లర్ ఎపిసోడ్లు చూస్తుంటే నాక్కూడా రెండు మూడు సినిమాల్లో నటించి ‘మా’ లో కార్డు తీసుకుని ఎన్నికల్లో ప్రెసిడెంట్ గా పోటీ చేయాలనుంది. ఏదేమైనా, ఈ ఎన్నికల తర్వాత 14th న మన “మహాసముద్రం” రిలీజ్ ఉంది.. అందరూ తప్పకుండా థియేటర్లలోనే చూడండి’ అంటూ మరో సంచలన ట్విట్ చేశాడు. కొత్త నటులు.. కొత్త సాంకేతికి సిబ్బందితో ‘ఆర్ఎక్స్ 100’లాంటి చిత్రాన్ని తెరకెక్కించి మంచి విజయం అందుకున్న అజయ్ భూపతి చేసిన ట్విట్ ఇప్పుుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.