పెళ్లి చేసుకున్న హీరోయిన్ ప్రణిత ! పెళ్లి కొడుకు ఎవరో తెలుసా?

బాపు బొమ్మ అనిపించుకునేంత అందం ఉండే హీరోయిన్స్ చాలా తక్కువగా ఉంటారు. కానీ.., తెలుగునాట చేసింది తక్కువ సినిమాలే అయినా హీరోయిన్ ప్రణిత సుభాష్ ఈ క్రేజ్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన అత్తారింటికి దారేది సినిమాలో నటించడంతో ఈమెకి మంచి గుర్తింపు లభించింది. ఆ తరువాత కూడా యన్టీఆర్, సిద్దార్ధ్ వంటి స్టార్ హీరోల సినిమాలలో మెరిసింది ప్రణిత. కానీ.., ఎక్కువగా సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్స్ చేయడంతో ప్రణితకి టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు లేకుండా పోయాయి. కానీ.., బాలీవుడ్, కోలీవుడ్ లో మాత్రం హీరోయిన్ ప్రణిత సుభాష్ బిజీగానే ఉంది. కానీ.., ఈ అమ్మడు ఇప్పుడు సడెన్ గా పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. నితిన్ రాజు అనే వ్యాపారవేత్తని ప్రణిత సుభాష్ ప్రేమించి, పెళ్లి చేసుకోవడం విశేషం. బెంగుళూరులోని ప్రణిత నివాసంలోనే ఈ పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలోనే ఈ వివాహ వేడుక జరిపించేశారట.

pra 2ఇక ఈ పెళ్ళికి వెళ్లిన ప్రణిత స్నేహితులు సోషల్ మీడియాలో పిక్స్ అప్లోడ్ చేయడంతో అసలు విషయం బయటకి వచ్చింది. దీంతో.., తన ప్రైవేట్ వెడ్డింగ్ గురించి హీరోయిన్ ప్రణిత స్పందించింది. “మాది లవ్ కమ్ అరెంజెడ్ మ్యారెజ్. చాలా కాలంగా నితిన్ నాకు తెలుసు. ఇక పెళ్లితో మా బంధాన్ని మరింత దగ్గర చేసుకున్నాము. ముందుగా మా ఇరు కుటుంబాలకు మా ప్రేమ విషయం చెప్పాం. వాళ్లు కూడా మా నిర్ణయం పట్ల చాలా సంతోషించారు. ఇక నా వ్యక్తిగత విషయాలను బయట పెట్టడం నాకు అంతగా ఇష్టం ఉండదు. అందుకే మా లవ్ గురించి ఎవ్వరికీ తెలియకుండా పోయింది. నేను నా పెళ్లి ఎలా అయితే జరగాలని కలలు కన్నానో అలానే జరిగింది. కరోనా కారణంగా అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు” అని ప్రణిత వివరించింది. ఇక ప్రస్తుతం ప్రణిత హంగామా-2, భుజ్ అనే హిందీ చిత్రాల్లో నటిస్తోంది. కన్నడలోనూ రమణ అవతార అనే చిత్రంలో నటిస్తుంది. కానీ.., రన్నింగ్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్స్ పూర్తి అయ్యాక కూడా ఈ బాపు బొమ్మ సినీ ఫీల్డ్ లో కంటిన్యూ అవుద్దా? లేదా? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. మరి రియల్ లైఫ్ లో న్యూ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ప్రణితకి కామెంట్స్ రూపంలో మీ బెస్ట్ విషెస్ అందించండి.