ఆ నగరంలో మరణాలను నిషేధించారు!

చావుపుట్టుకలనేవి ఎవరి చేతుల్లోనూ ఉండవు. వాటిని ఎవరు నియంత్రించలేరు. ఎవరు.. ఎప్పుడు ఎలా చనిపోతారో కూడా ఎవరికీ తెలియదు. ఈ భూమ్మీద ఎన్ని రోజులు బతకాలని రాసిపెట్టి ఉంటే.. అన్ని రోజులు జీవిచడమే కాలధర్మం. కానీ ఓ నగరంలో మాత్రం మరణాలను నిషేధించారు. అక్కడ ఎవరు చనిపోవడానికి వీల్లేదు. 70 ఏళ్లుగా అక్కడ ఎవరూ చనిపోలేదు కూడా. మీరు వినడానికి ఆశ్చర్యం కలిగించినా.. అది నిజం. మరి ఆ నగరం ఏంటి, అక్కడ ఎందుకు చనిపోవటం లేదో, దాని వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం.

నార్వేలోని 2000 వేల జనాభాతో లాంగ్ ఇయర్బైన్ అనే ఒక చిన్న పట్టణం ఉంది. ఈ నగరంలో మరణాలు నిషేధించారు. కారణం ఇక్కడ శీతాకాలంలో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ జీవించడమే చాలా కష్టం. ఎవరైనా చనిపోతే ఆ మృతదేహం చలి కారణంగా కుళ్లిపోకుండా చాలా ఏళ్లు అలానే ఉంటుంది. దీని వల్ల మృతదేహాలు మట్టిలో కలిపిపోవడానికి కొన్ని ఏళ్లు పడుతుంది. దీంతో ఎక్కడ పడితే అక్కడ శవాలు ఉంటాయి. వాటి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది. అందుకే ఇక్కడ చనిపోవడానికి అనుమతించరు.

కొన్ని సంవత్సరాల క్రితం శాస్త్రవేత్తలు అక్కడి శవంపై పరిశోధన చేసినప్పుడు పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. 1917 సంవత్సరంలో ఇన్ఫ్లూఎంజా కారణంగా మరణించిన వ్యక్తి శరీరంలో ఆ వైరస్ ఉన్నట్లు కనుగొన్నారు. అక్కడి చలి కారణంగా ఆ మృతదేహం నశించదు. దీంతో ఈ ప్రాంతంలో వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉందని వారి పరిశోధనలో తేలింది. ఈ విచారణ తర్వాత అక్కడి పరిపాలన విభాగం ఈ ప్రాంతంలో ప్రజల మరణాలను నిషేధించింది.

అందుకే ఇక్కడ ఎవరినైనా మరణించే స్థితిలో ఉంటే వారిని హెలికాప్టర్ సహాయంతో దేశంలోని మరొక ప్రాంతానికి తీసుకెళ్లి.. అతను చనిపోయిన తర్వాత అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఇక్కడ చనిపోవడానికి అనుమతించరు. అందుకే ఇతరులు కూడా ఈ ప్రాంతానికి వెళ్లేందుకు అసలు ఇష్టపడరు. ఈ నగరంలోని పరిస్థితులపై శాస్త్రవేత్తలు, సాహస పర్యాటకులు పరిశోధనలు చేస్తున్నారు.

తక్కువ జనాభా ఉన్న లాంగ్ ఇయర్బైన్ నగరంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే విమానం లేదా హెలికాప్టర్లో వేరే ప్రాంతానికి తీసుకెళ్తారు. ఆరోగ్యంగా ఉంటే ఇంటికి పంపిస్తారు. ఒకవేళ అనారోగ్యంతో చనిపోతే అక్కడే అంత్యక్రియలు నిర్వహించడం జరుగుతుంది. ఇది కొన్నేళ్లుగా ఇక్కడ ఇదే ఆనవాయితీ. ఏది ఏమైనా అలాంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అందరూ ఉండి అనాథ శవంలా ఎక్కడో బుడిద అవుతుంటారు. చనిపోతున్నాం అని తెలిసి ఆఖరి క్షణంలో కూడా బంధువులను వదలి వెళ్లడం.. ఇరువురిలో తీవ్ర వేద కలిగిస్తుంది. ఇలా చేయడం అక్కడి ఎవరికి ఇష్టం లేకున్న. అక్కడి వాతావరణం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేయాల్సి వస్తుంది. ఈ విచిత్ర నగరంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.