ఈ సృష్టి మనుగడ కొనసాగుతుందే సూర్యుడి కారణంగా. సూర్యరశ్మి వల్లే కిరణజన్య సంయోగక్రియ జరిగి.. మనిషికి అవసరమైన ఆహారం లభిస్తుంది. సూర్యుడు ఉదయించడం, అస్తమించడాన్ని బట్టి మన జీవన చక్రం తిరుగుతుంది. పగలు పని చేసుకోవడం, రాత్రి నిద్ర పోవడం చేస్తాము. మరి సూర్యుడు అసలు అస్తమించకపోతే.. 24 గంటలు పగలే ఉంటే.. ఊహించడానికే వింతగా ఉంది కదా. అసలు ప్రపంచంలో సూర్యుడు అస్తమించని ప్రాంతాలు ఏవైనా ఉంటాయా.. అంటే ఉన్నాయి. ఆ జాబితా ఇక్కడ ఇచ్చాం చూడండి..
స్వీడన్- 6 నెలలు
ప్రపంచంలో అత్యధికంగా ఈ దేశంలో ఏకంగా ఆరు నెలల పాటు కేవలం పగలు మాత్రమే ఉంటుంది. మే నుంచి ఆగస్ట్ మధ్యలో అర్థరాత్రి సమయంలో సూర్యుడు అస్తమించి.. మళ్లీ ఉదయం 4:30 గంటల సమయంలోనే ఉదయిస్తాడు.
నార్వే-76 రోజులు
అర్థరాత్రి సూర్యుడు ఉదయించే దేశంగా నార్వేకు పేరుంది. ఆర్కిటిక్ వలయం లోపల ఉండే ఈ దేశంలో మే నుంచి జూలై మధ్య 76 రోజుల పాటు అసలు సూర్యుడు అస్తమించడు. నార్వేలోని స్వాల్ బార్డ్ లో ఏప్రిల్ 10 నుంచి ఆగస్ట్ 23 వరకూ ప్రతి రోజు 24 గంటల పాటు సూర్యుడు ప్రకాశిస్తూనే కనిపిస్తాడు. ప్రజలు సమయాన్ని బట్టి.. నిద్రకు ఉపక్రమిస్తారు.
ఫిన్లాండ్-73 రోజులు
అందమైన సరస్సులు, ద్వీపాలకు పెట్టింది పేరైన ఈ దేశంలో ఏడాదికి 73 రోజుల పాటు సూర్యుడు అస్తమించడు. వేసవికాలంలో ఈ వింతను మీరు ఆస్వాధించవచ్చు.
నునావట్- 2 నెలలు
కెనడాలోని చిన్న నగరం నునావట్. ఇక్కడ ప్రతి ఏటా రెండు నెలల పాటు సూర్యుడు అస్తమించడు. 24 గంటలు పగలే ఉంటుంది. అలానే శీతాకాలంలో నెల రోజుల పాటు పూర్తిగా రాత్రి మాత్రమే ఉంటుంది.
బారో- 2 నెలలు
అమెరికాలోని అలస్కా రాష్ట్రంలోని బారోలో మే నెల చివరి నుంచి జూలై చివరి వరకూ సూర్యుడు అస్తమించడు. ఇక నవంబర్ మొదటి నుంచి నెల రోజుల పాటు ఈ ప్రాంతంలో అసలు సూర్యుడు ఉదయించడు. పూర్తిగా చీకటే ఉంటుంది. దీనినే పోరాల్ నైట్ అని పిలుస్తారు.
ఐస్ లాండ్- నెల రోజులు
యూరప్ లో గ్రేట్ బ్రిటన్ తర్వాత అతి పెద్ద ద్వీపమైన ఐస్ ల్యాండ్ లో జూన్ నెల మొత్తం.. సూర్యుడు అస్తమించడు. ఆ నెల రోజుల ఇక్కడ రాత్రి, పగలు అన్న తేడా ఉండదు.
మనకు ఏ రోజైనా పగలు కాస్త ఎక్కువ సమయం ఉన్నట్లు అనిపిస్తేనే.. చిరాకు వస్తుంది. అలాంటిది ఈ ప్రాంత ప్రజలు రోజుల తరబడి రాత్రి అనేది లేకుండా జీవిస్తున్నారంటే గ్రేటే కదా. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.