అదృష్టమంటే ఇదేరా! ఒక్క సెకను ఆగితే ప్రాణాలు పైకే.. వీడియో వైరల్‌

ఈ భూమ్మీద నీకు నూకలు ఉన్నాయిరా అన్న మాట విన్నారా? అదేనండి ఏదైనా పెద్దప్రమాదం నుంచి రెప్పపాటులో తప్పించుకుంటారు కదా.. అలాంటప్పుడు ఈ మాట అంటారు. అలాంటి వీడియోలు సోషల్‌ మీడియాలో కోకొల్లలు. ఒక్క సెకను కాలంలో భారీ ప్రమాదం నుంచి తప్పించుకోవడం. అదేదో చాక్లెచ్‌ యాడ్‌లో కర్రకోసం బామ్మ లేవగానే పియానో పడేలాంటి వీడియోలు చాలానే చూశాం. వాటిలో కొన్ని మాత్రమే అబ్బ ఏం లక్కు భయ్యానీది అనిపించేలా ఉంటాయి. ఈ వీడియో కూడా అలాంటిదే.

swimming boysఎక్కడో వంతెన మీద నుంచి కుర్రాళ్లు నీటిలోకి దూకుతున్నారు. అదంతా కొందరు రికార్డు చేస్తున్నారు. మొదట ఒక కుర్రాడు బాగానే దూకాడు. రెండో కుర్రాడు దూకే సమయంలోనే పెద్ద మ్యాజిక్‌ జరిగింది. అతను అలా దూకాడో లేదో.. అక్కడికి ఒక పెద్ద పడవ వచ్చింది. అంతే అందరూ అవాక్కయ్యారు. నీకు ఈ భూమ్మీద బ్రెడ్డులు, బన్నులు తినే రాత ఉందిరా అంటూ ఆటపట్టించారు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. మరి, మీరూ ఓ లుక్కేసేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Meemlogy (@meemlogy)