ప్రపంచం అంతా సాంకేతిక యుగంలో పరుగుపెడుతుంటే.. మన దేశంలోని మారుమూల గ్రామాల్లోని ప్రజలు ఇంకా మూఢ నమ్మకాలతోనే బతికేస్తున్నారు. ఇక ఇంతటితో ఆగకుండా అదే మూఢ నమ్మకాల్లో జీవిస్తూ.. చివరికి మనుషులను కూడా బలిస్తున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో చోట్ల జరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఓ యువకుడు తాతపై ప్రేమతో తన నాలుక కోసుకున్నాడు. నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం. ఇటీవల కర్ణాటకలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతుంది. తాతపై ప్రేమతో మనవడు నాలుక కోసుకోవడం ఏంటి? అసలు ఈ ఘటనలో ఏం జరిగిందనే పూర్తి వివవరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కర్ణాటక బళ్లారి జిల్లాలోని ఓ ప్రాంతం. ఇక్కడే ఓ యువకుడు తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటున్నాడు. అయితే ఈ యువకుడి తాత గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు చాలా చోట్ల వైద్యం చేయించారు. అయినా ఆ వృద్ధుడి ఆరోగ్యం మాత్రం మెరుగుపడడం లేదు. ఈ క్రమంలోనే అతని మనవడికి ఓ ఆలోచన వచ్చింది. దేవుడికి తన నాలుకను బలిస్తే మా తాత ఆరోగ్యం మెరుగుపడుతుందని అనుకున్నాడు. ఇందులో భాగంగానే ఆ మనవడు ఇటీవల తాత కోసం ఓ దేవుడి గుడి ముందు తన నాలుకును కోసి ఆ దేవుడికి బలిచ్చాడు.
దీనిని గమనించిన స్థానికులు వెంటనే అతని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో హుటాహుటిన ఆ యువకుడిని తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువకుడి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆ తర్వాత ఆ యువకుడి తల్లిదండ్రులు స్పందించి.. మా కుమారుడి మానసిక పరిస్థితి బాగలేదని, అందుకే ఇలా నాలుక కోసుకున్నాడని తెలిపారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతుంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.