ఓ బైక్ ఏకంగా పెట్రోల్ బంక్ లోనే పేలింది. దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో ఆ మంటల్లో బైక్ నడుపుతున్న యువకుడు సజీవదహనమయ్యాడు. దీనికి సంబంధించిన భయంకరమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.
ఈ మధ్యకాలంలో రోడ్డుపై నడుస్తున్న వాహనాలకు ఒక్కసారిగా నిప్పంటుకుంటుకుని పేలిపోతున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు సైతం రోడ్లపై ఎక్కడికక్కడ పేలిపోతున్నాయి. అయితే ఓ బైక్ ఏకంగా పెట్రోల్ బంక్ లోనే పేలింది. దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో ఆ మంటల్లో బైక్ నడుపుతున్న యువకుడు అక్కడికక్కడే సజీవదహనమయ్యాడు. దీనికి సంబంధించిన భయంకరమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే?
ఇద్దరు యువకులు పెట్రోల్ కోసమని బైక్ పై పెట్రోల్ బంక్ కు చేరుకున్నారు. ఇక పెట్రోల్ పోసుకుని తిరిగి వెళ్లే ప్రయత్నం చేశారు. బైక్ నడుపుతున్న యువకుడు కిక్ కొట్టాడు. బైక్ స్టార్ట్ అవ్వలేదు. దీంతో మరోసారి కిక్ కొట్టే ప్రయత్నం చేశాడు. దీంతో వెంటనే ఒక్కసారిగా ఆ బైక్ కు మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు పక్కనే ఉన్న పెట్రోల్ మిషన్ కూడా అంటుకున్నాయి. అయితే ఈ మంటల్లో బైక్ నడిపే వ్యక్తి అక్కడికక్కడే సజీవదహనమయ్యాడు. ఇదంతా అక్కడే ఉన్నసీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇదే వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ భయంతో వణికిపోతున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనే విషయం మాత్రం తెలియరాలేదు.
\
— Hardin (@hardintessa143) March 6, 2023