లాక్ డౌన్ కాలంలో ప్రాణాలను రిస్క్ లో పెట్టి మరీ.. విధులు నిర్వహిస్తున్న ఫ్రెంట్ లైన్ వారియర్స్ అంటే ముందుగా డాక్టర్స్, పోలీసులు అనే చెప్పుకోవచ్చు. కరోనా సోకిన వారిని డాక్టర్స్ బతికిస్తూ ఉంటే.., ఆ మహమ్మారి స్ప్రెడ్ అవ్వకుండా, ప్రజలు ఇళ్లల్లో నుండి బయటకి రాకుండా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఇంత చేస్తున్నా అక్కడక్కడా పోలీసుల తీరు హద్దులు దాటుతోందని, మరికొన్ని చోట్ల లాక్ డౌన్ అమలు చేయడంలో అలసత్వం వహిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో.., అసలు లాక్ డౌన్ సమయంలో పోలీసుల పనితీరు ఎలా ఉందొ తెలుసుకోవడానికి ఏకంగా ఏసీపీ రంగంలోకి దిగారు. అది కూడా అర్ధరాత్రి మారు వేషంలో అయన బయటకి వచ్చారు. దీంతో.., అర్ధరాతి పూట విధులు నిర్వహిస్తున్న పోలీసులకు చెమటలు పట్టేశాయి. లాక్ డౌన్ సమయంలో కొంతమంది ప్రజలు అవసరం లేకున్నా బయటకి వచ్చేస్తున్నారు. వీరిని హ్యాండిల్ చేయడం పోలీసులకు తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో సిద్ధిపేట అడిషనల్ ఎస్పీ రామేశ్వర్… క్షేత్రస్థాయిలో లాక్డౌన్ ఎలా జరుగుతుందో స్వయంగా వెళ్లి పరిశీలించాలనుకున్నాడు. కానీ.., తాను ఏసీపీ స్థాయిలో పర్యవేక్షణకి వెళ్తే అంతా బాగుందనే అనిపిస్తుంది. అందుకే మారువేషం కట్టారు ఏసీపీ.
ఒక పాత బైక్ ఎక్కి.., మొహానికి ఓ పెద్ద క్లాత్ ని మాస్క్ లా పెట్టేసి.., అర్ధరాత్రి రోడ్ పైకి వచ్చేశారు రామేశ్వర్. ఇక బయటకి వచ్చాక ప్రతి చెక్ పోస్ట్ దగ్గర ఆయన్ని పోలీసులు అడ్డగించారు. కొంత మందికి తనని తాను మెకానిక్ గా పరిచయం చేసుకున్నాడు. మరి కొంత మందికి మెడికల్ ఎమర్జెన్సీ అని చెప్పారు. ఇలా ఒక్కో చెక్ పోస్ట్ దగ్గర ఒక్కో కారణం ఏసీపీ చెప్పే అబద్దాలను పోలీసులు సులభంగా నమ్ముతూ వచ్చారు. కానీ.., 10 చెక్ పోస్ట్ లు దాటాక ఆయనకి స్ట్రిక్ట్ గా డ్యూటీ చేస్తున్న పోలీసులు తగిలారు. వారు ఏసీపీని అడ్డగించారు. తాను మెకానిక్ ని అని.., జ్వరంగా ఉంటే మెడిసిన్ కోసం బయటకి వచ్చాను అని వారికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ.., పోలీసులు మాత్రం ఏసీపీ బండిని సీజ్ చేశారు. మెడిసిన్ కావాలంటే మేమే తెప్పిస్తామని.., తమ ఉన్నత అధికారులు వచ్చే వరకు మాత్రం ఇక్కడే వెయిట్ చేయాలని కోరారు. ఒకవేళ ఇక్కడ ఉండలేకపోతే తామే ఇంటి వరకు వదిలిపెడతామని, అంతేగాని అధికారులు రాకుండా బండిని మాత్రం వదలలేమని వారు సమాధానం చెప్పారు. ఇదే సమయంలో మారు వేషంలో ఉన్న ఏసీపీ మంత్రి పీఏకి కాల్ చేశాను, మాట్లాడమన్నా ఆ పోలీసులు వినిపించుకోలేదు. పైగా.., మీకు జ్వరం లేదు. బాగానే ఉన్నారు. కాబట్టి.. ఇలా తిరగడం తప్పని వారు ఏసీపీని వారించారు. దీనితో ఏసీపీ తన అసలు రూపంలోకి వచ్చి.., ఆ పోలీసులను అభినందించారు. పరిస్థితికి తగ్గట్టు వ్యవహరించాలని, లాక్ డౌన్ సక్రమంగా అమలు అయ్యేలా చూడాలని ఆయన జిల్లా పోలీసులకు పిలుపు ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఏసీపీ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.