చిల్లర విలువేంటో పచారీకొట్టువాడికే బాగా తెలుసు అనడం అతిశయోక్తి కాదు. కొందరైతే చిల్లర ఇవ్వాలన్నా, తీసుకోవాలన్న అదేదో నామూషీగా ఫీలవుతుంటారు. కానీ, ఇప్పుడు ఆ చిల్లరే మిమ్మల్ని లక్షాధికారులను చేస్తుంది. అవునండి మీరు విన్నది నిజమే. ఎలాగో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదివేయండి మరి.
ఈ కామ్స్‌లో పురాతన వస్తవులను అధిక ధరకు కొంటూ ఉంటారు. విదేశాల్లో అయితే వింటేజ్ వస్తువులకు చాలా గిరాకీనే ఉంటుంది. విషయానికొస్తే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యూప్రో-నికెల్ అనే మెటల్‌తో తయారు చేసే రెండు రూపాయల కాయిన్‌ను ముద్రించడం ఆపేసిన సంగతి తెలిసిందే. గతంలో ముద్రించిన రెండు రాపాయలు మాత్రమే ప్రస్తుతం చలామణీలో ఉన్నాయి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న మాట అందరికీ తెలుసు కదా.. ఇప్పుడు అదే నిజం కాబోతోంది. ఆ పాత రెండు రూపాయలే మీకు లక్షలు తెచ్చిపెట్టనున్నాయి.
1994, 1995, 1997, 2000 ఈ సంవత్సరం రెండు రూపాయల నాణేలు మీ దగ్గరుంటే మీరు జాక్‌పాట్ కొట్టినట్లేనండి. వాటిని విక్రయించాలంటే, ముందుగా మీ పేరు, వివరాలతో క్విక్కర్‌లో మీ అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవాలి. మీ దగ్గరున్న రెండు రూపాయల కాయిన్‌ను ఫొటో తీసి అప్‌లోడ్ చేయండి. ఇంట్రస్ట్ ఉన్నవాళ్లు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఎంత మొత్తానికి అమ్మాలనుకుంటున్నారు, పేమెంట్ ఎలా అన్నది అప్పుడే మాట్లాడుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం చిల్లర డబ్బులు ఎక్కడున్నాయే వెతికేయండి మరి.