రోప్-సైక్లింగ్ తొక్కాలంటే మాములుగా చాలా మందికి వెన్నులో వణుకు పుడుతుంది. దీంతో ఈ రోప్-సైక్లింగ్ తొక్కాలంటే భయపడి వెనకడుగు వేస్తుంటారు. కానీ, ఓ 67 ఏళ్ల బామ్మ చాలా ఎత్తు నుంచి రోప్-సైక్లింగ్ తొక్కిందంటే మీరు నమ్ముతారా?
రోప్-సైక్లింగ్ చేయాలంటే ఎంతో ధైర్యం కావాలి. భూమిపై నుంచి చాలా ఎత్తులో ఉండి ఈ సైక్లింగ్ చేయడమంటే అంత ఆశామాషి వ్యవహారం ఏం కాదనే చెప్పాలి. కానీ, కొంతమంది మాత్రం ఈ రోప్-సైక్లింగ్ ను చాలా ఇష్టంగా తొక్కుతుంటారు. ఈ సైక్లింగ్ తొక్కాలంటే మాములుగా చాలా మందికి వెన్నులో వణుకు పుడుతుంది. దీంతో ఈ రోప్-సైక్లింగ్ తొక్కాలంటే భయపడి వెనకడుగు వేస్తుంటారు. కానీ, ఓ 67 ఏళ్ల బామ్మ చాలా ఎత్తు నుంచి రోప్-సైక్లింగ్ తొక్కిందంటే మీరు నమ్ముతారా?
మీరు నమ్మినా.. నమ్మకపోయినా.. ముమ్మాటికి ఇది నిజం. ఆ బామ్మ చాలా ఎత్తు నుంచి హెల్మెట్, భద్రతా పరికరాలు ధరించి ఎంతో ధైర్యంగా ఈ క్రీడలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది. అంత ఎత్తులో సైతం ఎలాంటి వణుకు బెణుకు లేకుండా రోప్-సైక్లింగ్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే? ఆ ముసలవ్వ ఎలాంటి స్పోర్ట్స్ దుస్తువులు ధరించకుండా కేవలం చీరకట్టులోనే రోప్-సైక్లింగ్ తొక్కి అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది. ఇక వయసు అనేది కేవలం అంకెలు మాత్రమేనంటూ ఇప్పటి యువతకు సవాల్ విసిరింది.
అయితే ఆ బామ్మ రోప్ సైక్లింగ్ చేస్తుండగా కొందరు వీడియో తీసుకున్నారు. ఇక అదే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కాస్త వైరల్ గా మారింది. ఇక ఆ వీడియోలను చూసిన చాలా మంది నెటిజన్స్ బామ్మ ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నారు. అయితే ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. 67 ఏళ్ల వయసులోనూ రోప్-సైక్లింగ్ చేసి అదరగొట్టిన ఈ బామ్మ ధైర్యంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
శారీలో బామ్మ రోప్ సైక్లింగ్.. pic.twitter.com/UwqEF3WU5q
— Hardin (@hardintessa143) February 14, 2023