ప్రభుత్వ ఉద్యోగ నియామాక పరీక్షల్లో అప్పుడప్పుడు పలు రకాల మార్పులు జరుగుతుంటాయి. ప్రభుత్వాలు విడుదల చేసి ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం కోసం అభ్యర్ధులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. తాజాగా తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు కూడా కొన్ని కీలక విషయాలను వెల్లడించింది. పోలీస్ నియామక తుది పరీక్షల్లో మార్పులు చేసినట్లు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు తెలిపింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజ్ఞప్తి మేరకు పోలీసు నియామక మండలి తుదీ పరీక్ష తేదీల్లో మార్పులు చేసింది. నాలుగు పరీక్ష తేదీల్లో మార్పులు చేసినట్లు ప్రకటించింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
కానిస్టేబుల్, ఎస్సై, ఏఎస్సై ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం విదితమే. గతంలో ప్రిలిమ్స్ పరీక్షలో క్వాలీఫై అయిన వారికి ఈవెంట్స్ ఎంపిక చేశారు. ఇటీవలే ఆ ఈవెంట్స్ ను సైతం పోలీస్ శాఖ పూర్తి చేసింది. ఈ ఈవెంట్స్ లో క్యాలీఫై అయిన వారు తుది పరీక్షకు ఎంపికయ్యారు. ఈ పరీక్షలో ప్రతిభ కనపర్చిన వారు పోలీసులు శాఖలో కొలువు పట్టనున్నారు. ఈక్రమంలోనే తుది పరీక్షల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు ఈ నేపథ్యంలోనే పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు తుది ఎగ్జామ్స్ తేదీల్లో పలు మార్పులు చేసింది.
ఎస్సై(ఐటీ), ఏఎస్సై(ఫింగర్ ప్రింట్స్), కానిస్టేబుల్, కానిస్టేబుల్(ఐటీ) పరీక్షల తేదీ మార్పు చేశారు. ఏప్రిల్ 23న జరగాల్సిన కానిస్టేబుల్ రాత పరీక్షను ఏప్రిల్ 30వ తేదీన నిర్వహించనున్నారు. అలాగే మార్చి 12న జరగాల్సిన ఎస్సై(ఐటీ) పరీక్షను 11వ తేదీకి మార్చారు. ఏఎస్సై(ఫింగర్ ప్రింట్స్) పరీక్ష మార్చి 12 నుంచి 11వ తేదీకి మార్చారు. కానిస్టేబుల్ (ఐటీ) పరీక్ష ఏప్రిల్ 23 నుంచి ఏప్రిల్ 30వ తేదీకి మార్చారు. మరీ టీఎస్ఎల్ పీఆర్ బీ చేసిన పోలీస్ నియామక తుదీ మార్పులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.