తెలంగాణ లోని ఇంటర్ ద్వితీయ సంవత్సర అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ఫలితాలను బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ విడుదల చేశారు. త్వరలో ఎంసెట్ కౌన్సెలింగ్ ఉన్నందున్న కేవలం ఇంటర్ సెంకడియర్ ఫలితాలను మాత్రమే విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఆగస్టు 1 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు దాదాపు 1.13 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు https://tsbie.cgg.gov.in/ లేదా http://www.manabadi.co.in/ వెబ్‌సైట్ నుంచి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.