ఈ మద్య నగరంలో ట్రాఫిక్ రూల్స్ ఎంతో కఠనం చేశారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న కారణంగా ప్రభుత్వం ట్రాఫిక్ విషయంలో పలు కఠిన ఆంక్షలు అమలు పరుస్తుంది. తాజాగా తన విధులు సక్రమంగా నిర్వర్తించినందుకు గాను ఓ ట్రాఫిక్ హూంగార్డ్ ని హైకోర్ట్ చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఎంతగానో మెచ్చుకోవడమే కాదు.. ఒక పుష్ప గుచ్చం ఇచ్చి అభినందించాడు. గత కొంత కాలంగా అబిడ్స్ ప్రాంతంలో ట్రాఫిక్ హోంగార్డ్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు అష్రప్అలీ.
అష్రఫ్ అలీని కొంత కాలంగా గమనిస్తూ వస్తున్నారు సీజే. డ్యూటీ విషయంలో అతడి నిబద్ధతను, క్రమశిక్షణను చూసి ఎంతో ఆకర్షితుడయ్యాడు. ఒకరోజు అష్రఫ్ ని సత్కరించాలని భావించారు సీజే. ఈ క్రమంలోనే అబిడ్స్‌లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద అష్రఫ్ ని కలిసి పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించారు. తమ డిపార్ట్ మెంట్ లోని ఉద్యోగిని ఎంతో గౌరవంగా సత్కరించినందుకు పోలీసు ఉన్నతాధికారులు ధన్యవాదాలు తెలుపుతున్నారు.