ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో హఠాత్తుగా గుండెపోటు వచ్చి చనిపోతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. అప్పటి వరకు అందరితో సంతోషంగా ఉన్నవారు అకస్మాత్తుగా కుప్పకూలి హార్ట్ ఎటాక్ తో చనిపోతున్నారు.
దేశంలో ఇటీవల వరుసగా గుండెపోటుతో మరణిస్తున్నవారి సంఖ్య పెరిగిపోతుంది. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా కనిపించేవారు హఠాత్తుగా ఉన్నచోటే కూప్పకూలిపోతూ ఆస్పత్రికి తీసుకు వెళ్లేలోపు చనిపోతున్నారు. చిన్న పెద్దా అనే వయసు తేడా లేకుండా హర్ట్ ఎటాక్ తో చనిపోవడం కలవరపెడుతుంది. గుండెపోటుతో కుప్పకూలిపోయిన వారికి సీపీఆర్ చేసి బతికించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఓ వ్యక్తి హఠాత్తుగా పడిపోయి ఊపిరి ఆడక ఇబ్బంది పడ్డాడు. అక్కడే ఉన్న ట్రాఫిక్ హూంగార్డు అతడికి సీపీఆర్ చేసి ప్రాణాలు పోశాడు. వివరాల్లోకి వెళితే..
ఈ మద్య తెలుగురాష్ట్రాల్లో హార్ట్ ఎటాక్‌తో మరిణించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. పట్టుమని 30 ఏళ్లు కూడా నిండకుండానే ఉన్నట్టుండి కుప్పకూలి చనిపోతున్నారు. కొన్నిసార్లు ఆస్పత్రికి తీసుకు వెళ్లేలోపు చనిపోతున్నారు. అయితే సరైన సమయంలో సీపీఆర్ చేసి సృహతప్పి పడిపోయిన వారిని బతికించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా బహదూర్ పుర సెంటర్ లో ఓ వ్యక్తి హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. అదే సమయంలో అక్కడ ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న హూంగార్డు అతని ప్రాణాలు కాపాడాడు. బహదూర్ పూర్.. పురానాపూల్ సమీపంలో టోలీచౌకి కి చెందిన ఓ వ్యక్తి హఠాత్తుగా కుప్పకూలిపోయాడు.
ఆ వ్యక్తి హఠాత్తుగా పడిపోవడం గమనించిన స్థానికులు వెంటనే అక్కడ ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న హూంగార్డు షహబాజ్ కి సమాచారం అందించారు. హటాహుటిన షహబాజ్ అక్కడికి చేరుకొని బాధితుడికి సీపీఆర్ చేయగా ఒక్కసారిగా వాంతులు చేసుకొని సృహలోకి వచ్చాడు. సరైన సమయంలో కుప్పకూలిపోయిన వ్యక్తికి సీపీఆర్ చేసి ఓ వ్యక్తి ప్రాణాలు నిలిపాడు. సమయస్ఫూర్తితో స్పందించి వ్యక్తి ప్రాణాలు కాపాడిన హూంగార్డు పై అక్కడ ఉన్నవారు సెల్యూట్ పోలీస్ అన్నా అంటూ ప్రశంసలు కురిపించారు.