గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలో వానలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వడగళ్ల వాన కురిసింది. ఆ వర్షాల నుంచి రాష్ట్ర ప్రజలు కోలుకోక ముందే.. మరో భారీ వర్షం రానున్నట్లు వాతావరణశాఖ తెలిపింది.
గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలో వానలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వడగళ్ల వాన కురిసింది. వికారాబాద్, మెదక్, రంగారెడ్డి, నల్గొండ, కరీంనగర్ వంటి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈ వర్షం దెబ్బకు రైతులు తీవ్రం నష్టపోయారు. వరి, శనగ, మిరప వంటి పంటలు నీటిపాలయ్యాయి. ఈ వర్షాలు మిల్చిన నష్టాల నుంచి తేరుకోక ముందే వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. నేటి సాయంత్రం, రేపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతూ.. రాత్రి సమయాల్లో కనిష్ట స్థాయికి పడిపోయి అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో నేడు, రేపు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా.. సాయంత్రానికి వాతావరణ చల్లబడి వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఈ రెండు, మూడు రోజుల్లో వడగళ్లతో కూడిన వానలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
అలానే రాష్ట్ర వ్యాప్తంగా నేడు, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. గురువారం పెద్దపల్లి, కుమురం భీం ఆసిఫాబాద్, కరీంనగర్ జిల్లాలో వర్షాలు కురిశాయి. భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా పలు జిల్లాలో పంటలు నేలకొరిగాయి. మామిడి, నిమ్మ వంటి పంటలు నేలరాయి. ఈదురు గాలుల ధాటికి విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు కూలిపోయాయి. దీంతో పలు గ్రామాలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఈ క్రమంలో తాజాగా ప్రజలకు మరోసారి వాతావరణ శాఖ ఈ కీలక విషయాలను వెల్లడించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.