గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసు పీడీ యాక్ట్ నమోదు చేశారు. మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ లో రాజాసింగ్ పై రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఈ క్రమంలో రాజాసింగ్ ని అరెస్టు చేసిన పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే అరెస్ట్ చేయాడానికి ముందే ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఇంట్లో పీడీ యాక్ట్ నోటీలుసు ఇచ్చారు. పీడీయాక్ట్ నమోదును పోలీసులు బోర్డు ముందు పెట్టనున్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి పీడీయాక్ట్ బోర్డు సమావేశం జరుగుతుంది. రాజాసింగ్ పై పీడీ యాక్ట్ నమోదుతో బెయిల్ వచ్చే అవకాశం లేదని న్యాయనిపుణులు అంటున్నారు. బోర్డు రాజాసింగ్ పై ఉన్న పీడీ యాక్ట్ ను కన్ఫామ్ చేస్తే మాత్రం ఏడాది పాటు జైలులో ఉండే అవకాశం ఉందని న్యాయనిపుణులు అభిప్రాయా పడుతున్నారు. అయితే తనపై నమోదు చేసిన పీడీయాక్ట్ ను రాజాసింగ్ కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది.
ఇక రాజాసింగ్ పై నమోదైన కేసుల వివరాలు పోలీసు వెల్లడించారు. రాజాసింగ్ పై 2004 నుంచి 101 క్రిమినల్ కేసులు నమోదు కాగా వాటిల్లో 18 మతపరమైన కేసులని పోలీసులు తెలిపారు. రాజాసింగ్ ఉద్దేశ్య పూర్వకంగానే వ్యాఖ్యలు చేస్తున్నారని, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా రాజాసింగ్ ప్రవర్తించారని పోలీసులు తెలిపారు. ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు విధ్వంసానికి దారితీస్తాయని పోలీస్ అధికారుల అన్నారు.
షాహినాయత్ గంజ్ , మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులకు సంబంధించి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ రాజాసింగ్ పై హైదరాబాద్ లోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. రాజాసింగ్ వ్యాఖ్యలు తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ, ఆయన విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారంటూ కొందరు పలు చోట్ల ధర్నలు కూడా చేశారు.