మహిళల భద్రత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలు తీసుకొచ్చాయి. అలానే రెండు తెలుగు రాష్ట్రాల సైతం మహిళ భద్రత కోసం అనేక చర్యలు తీసుకున్నాయి. తాజాగా హైదరాబాద్ అధికారులు మహిళ భద్రత కోసం ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.
మహిళల అభివృద్ధి కోసం, వారి భద్రత కోసం కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకున్నాయి. అలానే వారి సంక్షేమం కోసం మరెన్నో కార్యక్రమాలను ప్రభుత్వాలు చేపట్టాయి. ముఖ్యంగా ప్రభుత్వాలు, పోలీస్ అధికారులు మహిళ భద్రతకు పెద్దపీఠ వేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలో సైతం ఆడవారి భద్రత కోసం ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా హైదరాబాద్ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. అలానే వారి భద్రత కోసం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుందాం..
మహిళలు బస్సులో ప్రయాణం చేసే సమయంలో కొందరి ఆకతాయిల కారణంగా చాలా అసౌకర్యానికి గురవుతుంటారు. షీటీమ్స్, పోలీసులు అధికారులు ఇలాంటి ఆకతాయిలపై చర్యలు తీసుకుంటున్నారు. అయినా కూడా కొందరు వెదవలు ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు. అందుకే అధికారులు మహిళల కోసం ప్రత్యేక బస్సులను సైతం ఏర్పాటు చేశారు. ఇక తాజాగా హైదరాబాద్ లో మహిళల భద్రత కోసం పోలీస్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు మహిళ షటిల్ ఉచిత బస్సు సర్వీసులను ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ ఈ ఫ్రీ సర్వీస్ బస్సులకు జెండా ఊపి శుక్రవారం ప్రారంభించారు. శసైబరాబాద్ పోలీస్ అండ్ సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యురిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో శుక్రరవారం రాయదుర్గం జేఆర్ సీ కన్వెన్షన్ సెంటర్లో “ఉమెన్స్ కాంక్లేవ్ అండ్ అవార్డ్స్” కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీజీపీ అంజనీ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలానే సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఎస్సీఎస్సీ సెక్రటరీ కృష్ణ ఏదులు, ఇతర పోలీసు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలోనే మహిళల కోసం రెండు షటిల్ బస్సు సర్వీస్ లను ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ బస్సుల తయారు చేశారు. మహిళలకు అన్నీ సౌకర్యాలు ఇందులో ఉండేటట్లు ఏర్పాటు చేశారు. అలానే భద్రతకోసం బస్సులో ఓ సెక్యూరిటీగార్డు ఉంటారని నిర్వాహకులు తెలిపారు. ఈ బస్సు ప్రతిరోజు ఉదయం రెండు సార్లు, సాయంత్రం రెండు సార్లు ప్రయాణిస్తుందని నిర్వాహకులు స్పష్టం చేశారు. మరి.. హైదరాబాద్ మహిళల భద్రత కోసం అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.