జనగాం జిల్లా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఓ పుట్టిన రోజు వేడుకలో భావోద్వేగానికి లోనయ్యారు. నియోజకవర్గంలోని కరుణాపురంలో బుధవారం జరిగిన ఓ చర్చి ఫాదర్ బర్త్ డే వేడుకల్లో ఎమ్మెల్యే రాజయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ..తనపై వచ్చిన ఆరోపణలకు బాధపడుతూ కన్నీరు పెట్టుకున్నారు.
జనగాం జిల్లా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత తాటికొండ రాజయ్య ఓ పుట్టిన రోజు వేడుకలో భావోద్వేగానికి లోనయ్యారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలోని కరుణాపురంలో బుధవారం జరిగిన ఓ చర్చి ఫాదర్ బర్త్ డే వేడుకల్లో ఎమ్మెల్యే రాజయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసే సమయంలో రాజయ్య..తనపై అసత్య ఆరోపణలు చేసి మానసిక క్షోభకు గురి చేశారంటూ కన్నీరు పెట్టుకున్నారు. కేకు ముందు కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చేశారు. తనపై లైంగిక ఆరోపణలు రావడంతో తీవ్రంగా కలత చెందానని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న రాజయ్య స్టేషన్ ఘన్ పూర్ ప్రజలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. తన చివరి శ్వాస ఉన్నంత వరకు ప్రజల మధ్యలోనే ఉంటానని ఆయన తెలిపారు. స్టేషన్ ఘన్ పూర్ ప్రజల తనకు దేవుళ్లని, ఈ ప్రాంతమే తనకు దేవాలయమని ఆయన అన్నారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక లైంగికి వేధింపులకు గురి చేశానంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తాని ఆయన తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో తనకు పోటీగా నిలుచుని గెలవలేమని ఇలాంటి నీచానికి దిగజారారని మండిపడ్డారు. కూతురు వయసు ఉన్న మహిళను అడ్డుపెట్టుకుని తనపై బురద జల్లుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు తన ఆత్మస్థైర్యం మీద దెబ్బ కొట్టాలని చూస్తున్నారని ఆయన తెలిపారు. అలానే ఇప్పటికే నాలుగు సార్లు ఎమ్మెల్యే గా గెలిచానని, ఆరునూరైన ఐదుసారి, తన నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ..” నాకు 63 ఏళ్లు, నలుగురు చెల్లెలు, కోడుకు, కోడలు ఉన్నారు. ఎంతో పెద్దరికంగా జీవిస్తున్నా నాపై లైంగిక ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు వింటుంటే ఎంతో బాధ కలుగుతుంది. సొంత చెల్లెలి పక్కన నిలబడలేని పరిస్థితి, ఆప్యాయంగా పలకరించేలేని పరిస్థితి ఏర్పడింది” అని ఆయన కన్నీరు పెట్టుకున్నారు.
ఇలాంటి కుట్ర రాజకీయాలు మానుకుని దమ్ముంటే తనపై నేరుగా పోటీ చేసి గెలవాలని ప్రత్యర్థులకు ఎమ్మెల్యే సవాల్ విసిరారు. స్టేషన్ ఘన్ పూర్ లో తనపై జరుగుతున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన చెప్పారు. తనపై ప్రత్యర్థులు చేస్తున్న కుట్రలను, దిగజారుడు రాజకీయాలను గమనించి రాబోయే ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే రాజయ్య స్టేషన్ ఘన్ పూర్ ప్రజలకు పిలుపునిచ్చారు. మరి.. ఎమ్మెల్యే రాజయ్య చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.