సైన్స్, టెక్నాలజీ ఇన్నోవేషన్స్ తీసుకొస్తున్న కొత్త కొత్త డెవలప్‌మెంట్స్ రెండు వైపులా పదునైన కత్తిలాంటివి. వాడే తీరును బట్టి రిజల్ట్ ఉంటుంది. మంచికి వాడితే మంచి, చెడుకి వాడితే చెడు. ఈ విషయంలో మొబైల్ టెక్నాలజీలు ఏ మాత్రం తీసిపోవు. త్వరలో మనకు అందుబాటులోకి రాబోతున్న 5జీ టెక్నాలజీ వల్ల మంచి ఎంత ఉంటుందో ముప్పు అంతకు మించి ఉంటుందని ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఇదే సంగతి చాటిచెప్తూ 5జీ వైర్‌లెస్ నెట్‌వర్క్ టెక్నాలజీకి వ్యతిరేకంగా బాలీవుడ్ నటి జూహీ చావ్లా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ రేడియేషన్ వల్ల పౌరులు, వృక్ష, జంతుజాలానికి తీవ్ర సమస్యలు ఎదురవుతాయని ఆమె తన పిటిషన్‌లో వాదించింది. ప్రస్తుతం వాడుతున్న టెక్నాలజీ ఉన్న రేడియేషన్ స్థాయి కంటే 5జీలో 100 రెట్లు ఎక్కువ రేడియేషన్ ఉంటుందని, ఇది మనుషులపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని జూహీ స్పష్టం చేసింది.
5జీ నెట్‌వర్క్ వలన వచ్చే రేడియేషన్ తో పౌరులు, వృక్ష, జంతుజాలానికి తీవ్ర సమస్యలు ఎదురవుతాయని ఆమె తన పిటిషన్‌లో వాదించారు. ప్రస్తుతం మనం 4 జీ టెక్నాలజీలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా 4జీలో కంటే వచ్చే 5జీలో 100 రెట్లు ఎక్కువ రేడియేషన్ ఉంటుందని, ఇది మనుషులపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని జూహీ పిటిషన్ లో కోర్టుకు వినిపించారు. ఇంతవరకూ ప్రతివాదులు ఎలాంటి అధ్యయనాలు చేయనట్లయితే, ఎలాంటి ప్రైవేటు ప్రయోజనాలను ఆశించకుండా సమర్ధవంతమైన రీసెర్చ్ చేపట్టాలని కూడా పిటిషన్‌లో జూహీ చావ్లా కోరారని ఆమె తరపు న్యాయవాది పేర్కొన్నారు. తాను ఆధునిక టెక్నాలజీల అమలుకు వ్యతిరేకం కాదని, అయితే రేడియేషన్ కారణంగా తలెత్తబోయే తీవ్ర పరిణామాల గురించి అందరూ తెలుసుకోవాలని తన పిటిషన్‌లో జూహీ కోరింది. ఈ 5జీ టెక్నాలజీ కారణంగా ఎదురయ్యే తీవ్ర పరిణామాలకు సంబంధించి ఆధారాలను కూడా ఆమె కోర్టుకు సమర్పించింది. దీని రేడియేషన్ కారణంగా మనుషుల్లోని డీఎన్ఏ, కణాలు, ఇతర అవయవాలు దెబ్బతింటున్నాయని, క్యాన్సర్, గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి బారిన పడుతున్నారని తన పిటిషన్‌లో జూహీ వాదించింది. ఇండియాలో 5జీ ట్రయల్స్ కోసం ఈ మధ్యే టెలికాం డిపార్ట్‌మెంట్ – జియోతోపాటు ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, ఎంటీఎన్ఎల్‌లకు అనుమతి ఇచ్చిందన్న విషయం తెలిసిందే.