జీమెయిల్ యూజర్లు తక్కువ స్టోరేజ్ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అవసరంలేని ఈ-మెయిల్స్‌ను ఒకేసారి డిలీట్ చేయటం సాధ్యం కాదు. 50-100 కంటే ఎక్కువ మెయిల్స్‌ను డిలీట్ చేయడం సాధ్యపడదు. అయితే ఒక సింపుల్ ట్రిక్‌తో 100 కాదు.. ఏకంగా వేలకొద్దీ ఈ-మెయిల్స్‌ను డిలీట్ చేయొచ్చు. అదెలాగో చూడండి..ఎక్కువ మొత్తంలో మెయిల్స్‌ను డిలీట్ చేసేందుకు జీమెయిల్ వెబ్ వెర్షన్ ఓపెన్ చెయ్యాలి.
తరువాత “is:read” అనే కమాండ్ సెర్చ్ బాక్స్‌లో టైప్ చేసి ఎంటర్ చేయాలి. అప్పుడు మీరు చదివేసిన అన్ని మెయిల్స్ కనిపిస్తాయి. మెయిల్స్ పైన మీకు “All Select Box” కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. ఇప్పుడు కేవలం 50 సి మాత్రమే సెలక్ట్ అవుతాయి. ఇంకా ఎక్కువ మెయిల్స్ డిలీట్ చేయాలనుకుంటే.. “సెలెక్ట్ ఆల్ కన్వర్షేషన్స్ థట్ మ్యాచ్ థిస్ సెర్చ్” ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు మీరు చదివేసిన అన్ని మెయిల్స్ సెలక్ట్ అవుతాయి.
అనంతరం డిలీట్/ట్రాష్ ఐకాన్ పై క్లిక్ చేసి అన్నీ ఒకేసారి డిలీట్ చేయొచ్చు. ఈ బల్క్ యాక్షన్ తో రీడ్ చేసిన మెయిల్స్ 1,000 ఉన్నా.. 10,000 ఉన్నా ఒకేసారి డిలీట్ అయిపోతాయి. అయితే డిలీట్ చేసే ముందు మీకు అత్యంత ముఖ్యమైన మెయిల్స్ ని అన్ చెక్ చేయడం మర్చిపోకండి. అన్ చెక్ చేసిన తర్వాత మళ్లీ డిలీట్ ఆల్ సెలెక్టెడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. వీలుంటే, డిలీట్ చేసే ముందుగా మీకు ముఖ్యమైన మెయిల్స్ ని “Read” ఫోల్డర్ నుంచి ఇంకొక ఫోల్డర్ లోకి సెండ్ చేసుకోండి.
అటాచ్‌మెంట్స్ కలిగిన మెయిల్స్ మాత్రమే డిలీట్ చేసుకోవడానికి కూడా వీలుంది. ఇందుకోసం “Has Attachments” ఆప్షన్ పై క్లిక్ చేయాలి. “Advanced Search” ఆప్షన్ వినియోగించి ప్రత్యేకమైన సమయం, సైజు, వర్డ్స్ కలిగిన మెయిల్స్ డిలీట్ చేసుకోవచ్చు.నిజానికి జీమెయిల్ ఇన్‌బాక్స్‌లో చదివిన మెయిల్స్ కంటే చదవని మెయిల్సే ఎక్కువగా ఉంటాయి.
ఇదే ట్రిక్ ఉపయోగించి చదవని మెయిల్స్ కూడా సింపుల్ గా డిలీట్ చేయొచ్చు. ఇందుకోసం మీరు is:unread అని ఇన్‌బాక్స్‌లో టైప్ చేసి.. ఎంటర్ చేయాలి. తరువాత, is:read లో పేర్కొన్న విధంగా స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఇక, is:sent.. is:unsent.. is:starred సెర్చ్ బాక్స్ లో టైప్ చేసి అన్ని రకాల మెయిల్స్ డిలీట్ చేయొచ్చు. మీరూ ఒకసారి ట్రై చేసి చూడండి.