ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ బైక్ లు పేలిపోవడం, కాలిపోవడం పెరిగిపోతున్నాయి. దీంతో వాటిని వినియోగించాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఈవీల్లో పేలి కొందరు మరణించిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఓ అసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఓ ప్రాంతంలో ఎలక్ట్రిక్ బైక్ లో మంటలు చెలరేగాయి. వాటిని ఆర్పేందుకు యజమాని, స్థానికులు నీళ్లు పోశారు. మొదట మంటలు తగ్గి.. కొద్ది క్షణాల తర్వాత వాహనం పెద్ద శబ్ధంతో పేలిపోయింది. సాధారణంగా నీళ్లు పోస్తే మంటలు తగ్గిపోవాలి. కానీ ఆ ఘటనలో వాహనం పేలిపోయింది. ఈక్రమంలో అందరిలో ఒకటే సందేహం. అదే.. ఈవీలోని మంటలు ఆర్పేందుకు ఏం వాడాలి.
ఇలాంటి ఘటనల నేపథ్యంలో నిపుణలు పలు సూచనలు చేస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు చెలరేగితే అదుపులోకి తెచ్చేందుకు నీటిని పొరపాటున వినియోగించొద్దని హెచ్చరిస్తున్నారు. ఈవీలోని బ్యాటరీల్లో ఉండే సెల్ లో నిండి ఉండే రసాయన పదార్థల కారణంగా నీరు చల్లినప్పుడు రసాయనక చర్య జరుగుతుంది. దీంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా విద్యుత్తు కార్లు, ద్విచక్ర వాహనాలు లిథియం అయాన్ బ్యాటరీలతో నడుస్తాయి. సెల్స్ తయారీ, ప్యాకింగ్ లో లోపం ఉంటే వేడెక్కి మంటలు వ్యాపించే అవకాశం ఉంది. రసాయన చర్యతో బ్యాటరీ లోపల ఆర్గానికి ద్రవరూపం మంటలు మరింత పెరిగేందుకు కారణమవుతాయి.
ఇలాంటి సమయంలో నీరు పోస్తే హెడ్రోజన్, లిథియం హైడ్రాక్సైడ్ వెలువడుతాయి. హైడ్రోజన్ వాయువుకు మండే స్వభావం ఎక్కువ. ఈ కారణంతో నీళ్లు పోస్తే ఈవీలు ఒక్కసారిగా పేలిపోతాయి లేదా మంటలు ఎక్కువ అవుతాయి. ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటల చెలరేగినప్పుడు వాటిని నియంత్రించేదుకు ఏబీసీ పొడిని వాహనంపై లేదా బ్యాటరీపై భాగంలో చల్లాలి. దీంతో బ్యాటరీ పై భాగంలో ఓ పొర ఏర్పడుతుంది. దీనివల్ల మంటలు క్రమంగా అదుపులోకి రాకున్న మరింత పెరగకుండా ఉంటాయి.ఏబీసీ పొడి లేత పసుపు రంగులో ఎక్కువభాగం మోనో అమ్మోనియం పాస్ఫేట్‌తో కలిసి ఉంటుంది. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంల తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.