వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ లో భాగంగా వెస్టిండీస్ తమ చెత్త ఆట తీరుని కొనసాగిస్తోంది. ఇప్పటికే పసికూనలైనా జింబాబ్వే, నెదర్లాండ్స్ చేతిలో ఊహించని పరాజయాలను ఎదుర్కొన్న విండీస్.. తాజాగా స్కాట్లాండ్ పై జరుగుతున్న మ్యాచులో కేవలం 181 పరుగులకే కుప్పకూలింది.
ఐసీసీ క్వాలిఫయర్స్ మ్యాచులు ఆసక్తికరంగా జరుగుతున్నాయి. వరల్డ్ కప్ లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆరాటపడుతున్నాయి. సూపర్ సిక్స్ లో భాగంగా జరుగుతున్న ప్రతి మ్యాచ్ కూడా నువ్వా.. నేనా అనేట్లుగా జరుగుతుంది. మొదటి మ్యాచులో ఆతిధ్య జింబాబ్వే జట్టుకి ఒమన్ చెమటలు పట్టించగా.. నిన్న నెదర్లాండ్స్ పటిష్టమైన శ్రీలంక జట్టుని దాదాపు ఓడించినంత పని చేసింది. ఈ రెండు మ్యాచులు కూడా అభిమానులకి ఫుల్ కిక్ ఇచ్చాయి. ఇక అదే ఊపులో మరో పసికూన జట్టు స్కాట్లాండ్ విండీస్ కి షాక్ ఇచ్చేలా కనబడుతుంది మొదటి బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు దారుణమైన ప్రదర్శన చేసి వరల్డ్ కప్ నుంచి ఇంటికి వెళ్లే దిశగా కనిపిస్తుంది.
వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ లో భాగంగా వెస్టిండీస్ తమ చెత్త ఆట తీరుని కొనసాగిస్తోంది. ఇప్పటికే పసికూనలైనా జింబాబ్వే, నెదర్లాండ్స్ చేతిలో ఊహించని పరాజయాలను ఎదుర్కొన్న విండీస్.. తాజాగా స్కాట్లాండ్ పై జరుగుతున్న మ్యాచులో కేవలం 181 పరుగులకే కుప్పకూలింది. ఒక దశలో 60 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న విండీస్ ని హోల్డర్ (45), షెపర్డ్(36) ఆదుకున్నారు. వీరి భాగస్వామ్యమే లేకుంటే విండీస్ మరింత తక్కువ స్కోర్ కి పరిమితమయ్యేది. విండీస్ జట్టులో చార్లెస్, మేయర్ ఇద్దరు డకౌట్లుగా వెనుదిరిగారు. ఆదుకుంటాడనుకున్న హోప్ కేవలం 13 పరుగులే చేయగా..మేయర్స్ (5) పూరన్ (21) కూడా నిరాశ పరిచారు.
విండీస్ జట్టు వరల్డ్ కప్ కి అర్హత సాధించాలంటే సూపర్ సిక్స్ లో అన్ని మ్యాచులు గలవడంతో పాటుగా .. ఇతర జట్ల మ్యాచుల ఫలితాలు మీద ఆధారపడాల్సిన పరిస్థితి. అయితే 182 పరుగుల లక్ష్యంతో విండీస్ స్కాట్లాండ్ ని నిలువరించాలంటే కష్టంగానే కనిపిస్తుంది. ప్రస్తుతం స్కాట్లాండ్ 8 ఓవర్లలో వికెట్ నష్టానికి 27 పరుగులు చేసింది. మరి స్కాట్లాండ్ విండీస్ పై సంచలన విజయం సాధిస్తుందా? లేకపోతే లౌ స్కోరింగ్ మ్యాచ్ ని కాపాడుకొని వరల్డ్ కప్ ఆశలు సజీవంగా ఉంచుకుంటుందేమో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.