విధి అంటే ఇది. సరిగ్గా ఏడాది క్రితం ఎవరైతే టీమిండియా ఓడిపోతే చూసి నవ్వుకున్నారో.. ఇప్పుడు వాళ్లే పశ్చాత్తాపడుతున్నారు. కమాన్ టీమిండియా, మీరు గెలవడం.. మా సపోర్ట్ మీకే అని అంటున్నారు. పాక్ అభిమానులేంటి.. భారత జట్టు గెలవాలని కోరుకోవడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.. అవును మేం చెబుతున్నది నిజమే. టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా చేతిలో పాక్ ఓడిపోయినప్పుడు.. పెద్ద జట్టు కాబట్టి సరేలే అనుకున్నారు. తాజాగా జింబాబ్వేపై ఓడిపోవడం మాత్రం పాక్ ఫ్యాన్స్ కి కోలుకోలేని షాకిచ్చింది. ఇలా వరసగా రెండు మ్యాచులు ఓడిపోవడం పాక్ జట్టుని కష్టాల్లో పడేసింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుత టీ20 ప్రపంచకప్ లో పాక్ జట్టు సెమీస్ చేరాలంటే ఆ జట్టు మాత్రమే అద్భుతంగా ఆడితే సరిపోదు. మిగతా జట్ల ఫలితాలు కూడా పాక్ ఛాన్సులపై ప్రభావం చూపిస్తాయి. మెయిన్ గా చెప్పాలంటే భారత జట్టు దక్షిణాఫ్రికాని కచ్చితంగా ఓడించాలి. ఇక జింబాబ్వే.. తర్వాత ఆడే మూడు మ్యాచుల్లోనూ రెండింట్లో ఓడాలి. బంగ్లాదేశ్ జట్టు కూడా ఓ మ్యాచ్ లో ఓడిపోవాలి. ఇవన్నీజరిగితే సరిపోదు.. పాక్, మిగిలిన మ్యాచులు అన్నింట్లోనూ భారీ రన్ రేట్ తో గెలవాలి. వీటిలో ఏం జరగకపోయినా సరే పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించడం గ్యారంటీ.
ప్రస్తుతం గ్రూప్ బీలో ఉన్న ఆరు జట్లలో భారత్ 2 విజయాలతో 4 పాయింట్లతో టేబుల్ టాపర్ గా ఉంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో దక్షిణాఫ్రికా, జింబాబ్వే జట్లు చెరో పాయింట్ ఖాతాలో వేసుకున్నాయి. మూడు పాయింట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఓ విజయంతో బంగ్లాదేశ్ నాలుగులో, పాక్ ఐదో స్థానంలో, ఐర్లాండ్ ఆరో స్థానంలో ఉన్నాయి. ఇక పాక్ జట్టుకు దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్.. దాదాపు క్వార్టర్ ఫైనల్ లాంటిదే. ఇక గతేడాది టీ20 వరల్డ్ కప్ సందర్భంగా భారత్ వైఫల్యన్ని చూసి నవ్వుకున్న పాక్ అభిమానులు… ఇప్పుడు సేమ్ అలాంటి పరిస్థితిని ఫేస్ చేశారు.
In 2021 WC, India was evaluating all possible options point wise to qualify for Semis and all Pak fans, Media journalists were happy and enjoying about that.
In this T20WC tables have turned up and Pak is discussing options to qualify .
Moral is What goes around comes around 🤩 pic.twitter.com/4Xm7ybg4E9— Saurabh Yadav (@Saurabhkry08) October 28, 2022
Only hope for Pak in order to qualify for semis👇🏽
🇧🇩V🇿🇼➡️🇧🇩won
🇵🇰V🇳🇱➡️🇵🇰 won
🇿🇦V🇮🇳➡️🇮🇳 won
🇿🇼V🇳🇱➡️🇿🇼 won
🇮🇳V🇧🇩➡️🇮🇳won
🇵🇰V🇿🇦➡️🇵🇰 won
🇿🇦V🇳🇱➡️🇿🇦 won
🇵🇰V🇧🇩➡️🇵🇰 won
🇮🇳V🇿🇼➡️🇮🇳 won
Then Points table:
🇮🇳 10 points
🇵🇰 6 points
🇿🇦5 points
🇿🇼 5 points
🇧🇩 4 points
🇳🇱 0 points
Wht do u think?— Faakhir Mehmood (@Faakhir_Mehmood) October 27, 2022