వరల్డ్ కప్ కి ముందు టీమిండియా ఆసియా కప్ లాంటి మరో మెగా టోర్నమెంట్ ఆడాల్సి ఉంది. అయితే ఇక్కడే అసలు కథంతా ముడి పడి ఉంది. తాజా సమాచార ప్రకారం పాకిస్థాన్ ఈ వరల్డ్ కప్ ఆడడం అనుమానంగా మారింది.
భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ లో వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మరో మూడు నెలల సమయానికి ముందే ఈ వరల్డ్ కప్ పై భారీ హైప్ నెలకొంది. దిగ్గజాలు, ఎక్స్ పర్ట్స్ ఎవరు గెలుస్తారో ఇప్పటికే జోస్యం చెప్పేసారు. దీనికి సంబంధిన షెడ్యూల్ ని కూడా ఇటీవలే ఐసీసీ విడుదల చేసింది. రౌండ్ రాబిన్ లీగ్ లో జరిగే ఈ టోర్నీ అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనుంది. ఇక అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 15 న గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. అయితే తాజా సమాచార ప్రకారం పాకిస్థాన్ ఈ వరల్డ్ కప్ ఆడడం అనుమానంగా మారింది. అదే జరిగితే పాకిస్థాన్ ప్లేస్ లో స్కాట్లాండ్ ఏ వరల్డ్ కప్ కి అర్హత సాధిస్తుంది.
వరల్డ్ కప్ కి ముందు టీమిండియా ఆసియా కప్ లాంటి మరో మెగా టోర్నమెంట్ ఆడాల్సి ఉంది. అయితే ఇక్కడే అసలు కథంతా ముడి పడి ఉంది. షెడ్యూల్ ప్రకారం ఆసియా కప్ 2023 టోర్నీ పాకిస్తాన్‌తో జరగాల్సి ఉంది. అయితే ఇండియా, పాకిస్తాన్‌లో పర్యటించేందుకు అంగీకరించకపోవడంతో హైబ్రిడ్ మోడల్ అనే కొత్త కాన్సెప్ట్ ని తీసుకొని వచ్చింది పాకిస్థాన్. దీని ప్రకారం పాకిస్థాన్ లో కేవలం 4 మ్యాచులే జరుగుతాయి. మరో 9 మ్యాచులు శ్రీలంకలో జరుగుతాయి. అయితే ఈ నిర్ణయాన్ని పాకిస్థాన్ కాబోయే క్రికెట్ చైర్మన్ జకా అస్రఫ్ కి నచ్చడం లేదు. ఈ హైబ్రిడ్ మోడల్ వలన పెద్దగా పాక్ కి ఒరిగేదేమీ లేదు అని తెలిపాడు.
భారత్ పాకిస్థాన్ లో పర్యటించకోపోతే పాకిస్థాన్ వరల్డ్ కప్ ఆడేందుకు భారత్ కి పంపే ప్రసక్తే లేదని చెప్పాడు. అగాథంలో రమీజ్ రాజా కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసాడు. దీంతో భారత్ వేదికగా జరగబోయే వరల్డ్ కప్ కి పాకిస్థాన్ వస్తుందా? లేదనే అనుమానాలు వ్యక్తమ అవుతున్నాయి. ఒకవేళ పాకిస్థాన్ మొండి పట్టుదలతో ఈ టోర్నీ ఆడేందుకు భారత్ కి రాకపోతే స్కాట్లాండ్ జట్టు పాకిస్థాన్ ప్లేస్ లో ఆడబోతుంది అని ఐసీసీ ప్రకటించింది. ఇటీవలే ముగిసిన క్వాలిఫయర్స్ మ్యాచులో స్కాట్లాండ్ టాప్ 3 లో నిలిచినా సంగతి తెలిసిందే. అదే జరిగితే స్కాట్లాండ్ కి లక్కీ ఛాన్స్ దొరికినట్టే. మరి ఈ గందరగోళానికి పుల్ స్టాప్ పెట్టాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఏ విషయంలో ఏం జరుగుతుందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.