ఒకప్పుడు క్రికెట్ మ్యాచ్ లంటే కేవలం ఆటని మాత్రమే చూసేవారు. మ్యాచ్ లు కూడా యమ ఇంట్రెస్టింగ్ గా ఉండేవి. టెక్నాలజీ పెరిగిన తర్వాత ఆట కంటే స్టేడియంలో ఇతరత్రా విషయాలపై ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపించడం స్టార్ట్ చేశారు. విదేశాల్లో జరిగిన మ్యాచుల్లో తెలుగు రాజకీయ పార్టీలు జెండాలు కనిపించడం, జై బాలయ్య స్లోగన్స్ వినిపించడం, బుట్టబొమ్మ పాటకు వార్నర్ స్టెప్పులేయడం.. ఇలా ఆసక్తికర సంఘటనల్ని చాలానే చూశాం. వీటితోపాటే కొందరు వ్యక్తులు కూడా చాలా ఫేమస్ అయ్యారు. అలాంటి వారిలో ఓ పాక్ ఫ్యాన్ కూడా ఉన్నాడు. ఆస్ట్రేలియా-పాక్ మ్యాచ్ సందర్భంగా అతడి నిలబడిన పోజు.. ఆ తర్వాత కాలంలో మీమ్స్ లో యూజ్ చేయడం చాలా నార్మల్ అయిపోయింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. క్రికెట్ లో గత కొన్నేళ్ల కాలంలో జరిగిన చాలా సంఘటనలు పూర్తి వైరల్ గా మారాయి. అలాంటి వారిలో బట్టతలతో ఉన్న పాక్ అభిమాని ఒకరు చాలా ఫేమస్ అయ్యారు. ఇప్పుడు ఆ వ్యక్తిలానే పోజు పెట్టిన మరో వ్యక్తి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాడు. దీంతో ఈ రెండింటిని పోల్చి చూస్తూ అభిమానులు ఆ ఫొటోని ట్రెండ్ చేస్తున్నారు. తాజాగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో పాక్ గెలుపునకు 12 బంతుల్లో 22 పరుగులు అవసరమైన దశలో ఆ వ్యక్తి ఇలా పోజిచ్చాడు. వెంటనే కెమెరామన్ దాన్ని క్యాప్చర్ చేశాడు. దీంతో హాట్ స్టార్ లో మ్యాచ్ చూస్తున్న వాళ్లు.. టక్కున క్యాచ్ చేసిన 2019 వన్డే వరల్డ్ కప్ లో అలా.. 2022 టీ20 వరల్డ్ కప్ లో ఇలా అని క్యాప్షన్స్ పెడుతున్నారు.
ఇదిలా ఉండగా ఈసారి టీ20 వరల్డ్ కప్ లో పాక్ జట్టు ఘోరంగా ఆడుతోంది. టీమిండియాపై ఓడిపోయిన పాక్ జట్టు.. జింబాబ్వేతో గురువారం జరిగిన మ్యాచ్ లోనూ ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. ఫలితంగా సెమీస్ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంది. దీనికి తోడు పాక్ స్టార్ ఆటగాళ్లు అయిన బాబర్ ఆజాం, షాహీన్ అఫ్రిది అయితే రెండు మ్యాచుల్లోనూ తేలిపోయారు. అఫ్రిది ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. బాబర్ అయితే సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమవుతున్నారు. ఇలా ఓ వైపు పాక్ క్రికెటర్లు టీ20 వరల్డ్ కప్ లో నిరాశపరుస్తుంటే.. మరోవైపు పాక్ అభిమానులు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఇస్తున్నారు. మరి ఈ ఐకానిక్ పోజుపై మీ అభిప్రాయం ఏంటి?
hahaha 😂😂 pic.twitter.com/2b2AgVvkEa
— cHanDU (@iamchandudon) October 28, 2022