సాధారణంగా మ్యాచ్ అంటే అందులో ఫోర్లు, సిక్సులు హైలెట్ గా నిలుస్తాయి. కానీ నిన్న ఎమర్జింగ్ ఆసియా కప్ లో మాత్రం భారత్, బంగ్లా ఆటగాళ్లు ఆటలో కాకుండా మాటల్లో తమ దూకుడు చూపించారు.
ఎమర్జింగ్ ఆసియా కప్ లో భాగంగా నిన్న భారత్- బంగ్లాదేశ్ మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో 51 పరుగుల తేడాత భారత్-ఏ జట్టు 51 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 49.1 ఓవర్లలో 211 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ యాష్ దూల్ 86 బంతుల్లో 65 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ కి ఓపెనర్లు అదిరిపోయే ఆరంభం ఇచ్చినప్పటికీ మిగిలిన వారు విఫలమయ్యారు. దీంతో బంగ్లాదేశ్ ఏ జట్టు 160 పరుగులకే ఆలౌటైంది.భారత్ స్పిన్నర్ నిశాంత్ సింధు 5 వికెట్లతో బంగ్లాదేశ్ పతనాన్ని శాసించాడు. ఇక మ్యాచ్ విషయం పక్కన పెడితే బంగ్లాదేశ్, భారత్ ఆటగాళ్లు మాటలతో రెచ్చిపోయారు.
సాధారణంగా మ్యాచ్ అంటే అందులో ఫోర్లు, సిక్సులు హైలెట్ గా నిలుస్తాయి. కానీ నిన్న ఎమర్జింగ్ ఆసియా కప్ లో మాత్రం భారత్, బంగ్లా ఆటగాళ్లు ఆటలో కాకుండా మాటల్లో తమ దూకుడు చూపించారు. వివరాల్లోకెళ్తే ఒక సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఓపెనర్లు ఇచ్చిన మెరుపు ఆరంభం వల్ల విజయం దిశగా దూసుకెళ్తుంది. అయితే ఈ క్రమంలో అనూహ్యంగా పుంజుకున్న భారత ఆటగాళ్లు వరుస విరామాల్లో వికెట్లు తీసి మ్యాచ్ ని ఆసక్తికరంగా మార్చారు. ఇన్నింగ్స్ 26 ఓవర్లో యువరాజ్ సిన్హా దోదూయ బౌలింగ్ వేయగా సౌమ్య సర్కార్ బ్యాట్ ఎడ్జ్ తీసుకొని స్లిప్ వైపుగా వెళ్ళింది. అక్కడే ఉన్న నీకీ జోస్ ఈ క్యాచ్ ని డైవ్ చేసి అందుకున్నాడు. దీంతో భారత ఆటగాళ్లు సంబరాల్లో తేలిపోయారు. ఈ దశలో హర్షిత్ రానా సౌమ్య సర్కార్ వైపుగా గట్టిగా కేకలు వేస్తూ కనిపించాడు.
ఇది చూసిన సౌమ్య సర్కార్ హర్షిత్ రానాతో గొడవకు దిగాడు. ఇంతలో అంపైర్, భారత ఆటగాళ్లు వచ్చి ఇద్దరినీ విడదీసే ప్రయత్నం చేశారు. హర్షిత్ రానాకీ జూనియర్ హార్దిక్ పాండ్య అనే పేరుంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో బౌలింగ్ తో పటు బ్యాటింగ్ లోను అదరగొడుతున్నాడు. ఆటలోనే కాదు ప్రవర్తనలో హార్దిక్ పోలికలు కనిపించాయి. అయితే భారత ఆటగాళ్లు ఇలా గొడవపడడానికి బంగ్లాదేశ్ ఆటగాళ్ళే కారణమని తెలుస్తుంది. భారత్ ఆటగాళ్లు అవుట్ అవుతున్న సమయంలో పెవిలియన్ వైపు వేలు చూపిస్తూ కనిపించారు. ఇది గమనించిన భారత ఆటగాళ్లు బంగ్లా వికెట్లు తీసే సమయంలో అంతే రెచ్చిపోయారు. మొత్తానికి బంగ్లా ఆటగాళ్లపై భారత్ రెచ్చిపోయిన విధానం ముయాచ్ మొత్తానికి హైలెట్ గా మారింది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
How smart was that from Riyan?!
.
.#EmergingAsiaCup2023 #INDAvBANA pic.twitter.com/i7y0MJJaBL— FanCode (@FanCode) July 21, 2023