టీమిండియా ఉమెన్స్ టీమ్ స్టార్ క్రికెటర్ షఫాలీ వర్మను ఇంతవరకు మహిళల బౌలింగ్‌ను చితక్కొడుతుండగా చూశాం.. ఇప్పుడు ఈ స్టార్ ప్లేయర్ అండర్25 మేల్ క్రికెటర్ల స్పీడ్ బౌలింగ్‌ను ప్రాక్టీస్ చేస్తున్నారు. ఉమెన్ క్రికెట్లో షార్ట్ బాల్స్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు పురుషుల బౌలింగ్‌ను షఫాలీ వర్మ ప్రాక్టీస్ చేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ ప్రాక్టీస్‌లో కూడా షఫాలీ పురుషుల బౌలింగ్‌ను కూడా ధీటుగా ఎదుర్కొంటున్నారు.
టీమిండియా ఓపెనర్‌గా దూకుడైన ఆట తీరును ప్రదర్శించే షఫాలీ.. ఈ ప్రాక్టీస్ తర్వాత మరింత చెలరేగుతుందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి టీమిండియా ఉమెన్స్ ప్లేయర్ పురుషుల బౌలింగ్‌ను ప్రాక్టీస్ చేసి తన నైపుణ్యాన్ని పెంచుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.