ఆసియా కప్ 2022లో భారత పురుషుల జట్టు విఫలమైనా.. వుమెన్స్ టీమ్ సత్తా చాటింది. వుమెన్స్ ఆసియా కప్ 2022 ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసి ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. శనివారం శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 8 వికెట్లు తేడాతో విజయం సాధించిన టీమిండియా.. ఏడో సారి ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది. ఈ ఘన విజయం తర్వాత టీమిండియా క్రికెటర్లు ఓ రేంజ్‌లో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. స్టార్ ప్లేయర్ జెమియా రోడ్రిగ్స్ నేలపై పడుకుని కాళ్లు చేతులు ఊపుతుంటే.. మిగతా ఆటగాళ్లంతా ఆమెపై కలర్ పేపర్స్ వేస్తూ.. విచిత్రమైన సంబురాలు చేసుకున్నారు. ఈ సెలబ్రేషన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
స్మృతి మంధానను ఉరికించి ఉరికించి కొట్టిన రోడ్రిగ్స్..
ఫైనల్‌లో మ్యాచ్‌లో 66 పరుగుల లక్ష్యఛేదనలోనూ టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన హాఫ్ సెంచరీతో దుమ్ములేపింది. కానీ.. తొటి క్రికెటర్ చేతుల్లో మాత్రం దెబ్బలు తిన్నది. జెమియా రోడ్రిగ్స్.. స్మృతి మంధానను ఉరికించి ఉరికించి కొట్టింది. ఇంతకు స్మృతి ఏం చేసిందంటే.. ఇతర క్రికెటర్లతో కలిసి వింత సెలబ్రేషన్స్ చేసుకుంటున్న జెమియాను స్మృతి మంధాన వచ్చి డిస్టబ్ చేసింది. దీంతో.. ఒక ఉదుటను లేచిన రోడ్రిగ్స్.. మంధానను పరిగెత్తించింది. కానీ.. చివరికి పట్టుకుని ఒక్క గుద్దు గుద్దింది. కానీ.. ఇందంతా సరదాగానే జరిగింది. విజయానందంలో ఇలా టీమిండియా క్రికెటర్లు సరదా సరదాగా సంబురాలను జరుపుకున్నారు.
ఇక ఫైనల్ మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టానికి కేవలం 65 పరుగులు మాత్రమే చేయగలిగింది. రేణుకా సింగ్ ధాటికి లంక బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూకట్టారు. శ్రీలంక బ్యాటర్లలో కేవలం ఇద్దరు మాత్రమే రెండెంకల స్కోర్‌ను చేరుకున్నారు. భారత బౌలర్లలో రేణుకా సింగ్ 3 ఓవర్లలో కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది. అలాగే గైక్వాడ్ 2, స్నేహ్ రాణా 2 వికెట్లు తీసుకున్నారు. 66 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన టీమిండియా కేవలం 8.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కాగా.. 66 పరుగులు స్వల్ప లక్ష్యఛేదనలోనూ స్మృతి మంధాన చెలరేగి ఆడి.. 25 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 51 పరుగులు చేసి హాఫ్ సెంచరీ పూర్తిచేసుకుంది.
Smriti Mandhana interrupts Jemimah’s Unique Celebration 😂 #CricketTwitter #WomensAsiaCup2022 pic.twitter.com/UlGNpQKpz5
— Female Cricket (@imfemalecricket) October 15, 2022