క్రికెట్ ఎంత ఉత్కఠభరితమైన ఆటనో.. అంతకుమించి ఫన్ కూడా ఇస్తుంది. ప్రేక్షకులకు వినోదం పంచడంలో ఆటగాళ్లే కాదు.. అంపైర్లు కూడా కొన్నిసార్లు భాగస్వాములవుతారు. అంతర్జాతీయ క్రికెట్‌లో బిల్లీ బౌడెన్ అనే అంపైర్ గురించి చాలామంది క్రికెట్ అభిమానులకు తెలిసే ఉంటుంది. విచిత్రమైన సిగ్నల్స్‌తో నవ్వులు పూయించేవాడు. దాంతో అతను బాగా ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు మన దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో బెల్లీ బౌడెన్‌కు మించి ఉన్నాడు ఒక అంపైర్.
What’s your take on this #BillyBowden?#CricketTwitter pic.twitter.com/eqOpO2kqCC
— Sachin Tendulkar (@sachin_rt) December 13, 2021
బౌలర్ వేసిన బంతిన వైడ్‌గా వెళ్లింది. దాంతో అంపైర్‌గా ఆ బంతిని వైడ్ అని సాధారణంగా చేతులతో కాకుండా.. తలకిందకి చేసి కాళ్లతో వైడ్ అని సిగ్నల్ ఇచ్చాడు. ఈ వీడియోను టీమిండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేశాడు. ఇలాంటి ఫన్నీ సిగ్నల్స్ ఇచ్చే బిల్లీ బౌడెన్‌ను ప్రస్తావిస్తూ.. దీనిపై ఏమంటావ్ అంటూ సచిన్ ప్రశ్నించాడు. మరి ఈ విచిత్రమైన అంపైర్ ప్రత్యేక శైలిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.