ప్రస్తుతం ఎక్కడ చూసిన దేశమంతా సచిన్ హడావుడే కనిపిస్తుంది. అంతా సచిన్ నామ స్మరణమే వినిపిస్తుంది. దీనికి కారణంఈ రోజు ( ఏప్రిల్ 24) భారత క్రికెట్ దిగ్గజం , క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పుట్టిన రోజు.అయితే పుట్టిన సచిన్ ఒక చిన్న సర్ప్రైజ్ ఇచ్చాడు.
ప్రస్తుతం ఎక్కడ చూసిన దేశమంతా సచిన్ హడావుడే కనిపిస్తుంది. అంతా సచిన్ నామ స్మరణమే వినిపిస్తుంది. అట్టహాసంగా వేడుకలు జరుగుతున్నాయి. అభిమానుల నుంచి ప్లేయర్ల వరకు అందరి దృష్టి ఈ దిగ్గజ క్రికెటర్ మీదే ఉంది. అదేంటి ఓ వైపు ఐపీఎల్ జరుగుతుంటే సచిన్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు అనే అనుమానం మీలో వచ్చి ఉండొచ్చు. దీనికి కారణం ఏంటి అని పరిశీలీస్తే ఈ రోజు ( ఏప్రిల్ 24) భారత క్రికెట్ దిగ్గజం , క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పుట్టిన రోజు. బర్త్ డే ఈ రోజే అయినా గత రెండు రోజులనుండే వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా భాగంగా సచిన్ ఒక యాడ్ లో కనిపించి అందరిని సర్ప్రైజ్ చేసాడు ఆ యాడ్ ఏంటి అని పరిశీలిస్తే ?
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ గురించి తెలియని వారి ఎవరు ఉండరేమో. మాస్టర్ బ్లాస్టర్ టీమిండియాలోకి అడుగుపెట్టినప్పటినుంచి దేశం మొత్తంగా ఈ పేరు అప్పట్లో ఒక సంచలనం. 24 సంవత్సరాలుగా టీమిండియాకి సేవలను అందించిన సచిన్.. ఒకానొక దశలో (1990ల్లో ) భారత్ క్రికెట్ ని తన భుజాలపై మోశాడు. సచిన్ అంటే భారత క్రికెట్. భారత్ క్రికెట్ అంటే సచిన్ అనేంతలా ఫాలోయింగ్ సంపాదించాడు. ఈ నేపథ్యంలో అందరూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతుండగా సచిన్ చేసిన ఒక యాడ్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఇందులో భాగంగా టైర్లకి సంబంధించిన ఒక యాడ్ లో టెండూల్కర్ నటిస్తున్నాడని అర్ధం అవుతుంది. ప్రారంభంలో చాలా సీరియస్ గా డైరెక్టర్ సీన్ వివరించడం మనం గమనించవచ్చు. సచిన్ కూడా చాలా కూల్ గా వింటున్నాడు. ఇంతలో డైరెక్టర్ సర్ చాలా సింపుల్ ఈ బ్యాట్ తో మీరు టక్ టక్ అని కొట్టాలి. ఇంతలో సచిన్ బాల్ ఎక్కడ అని అడుగుతాడు. బాల్ తో కాదు సార్ బ్యాట్ తో టైర్ ని కొట్టాలి అని చెబుతాడు. దీనితో అది సాధ్యపడదు కాబట్టి సచిన్ ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. దీంతో వారు సార్ సార్ అని పిలుస్తూ ఉంటారు. చాలా ఫన్నీగా సాగిన ఈ వీడియో నవ్వులు తెప్పిస్తుంది. ప్రస్తుతం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సచిన్ నేడు 51 లోకి అడుగుపెడుతున్నారు. సచిన్ టెండూల్కర్ కి మీరు కూడా బర్త్ డే విషెస్ తెలిపేయండి. మరి పుట్టిన రోజు సచిన్ నటించిన ఈ యాడ్ మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
Jab Sachin paaji ka bat bolte hai hai na sab chup ho jaate hai stadium main @sachin_rt #ApolloTyres #10Performance #HappyBirthdaySachin #50ForSachin pic.twitter.com/r66sC8nuEm
— Sundar (@sundar_56) April 24, 2023