మహేంద్ర సింగ్ ధోని కొచ్ గా కొత్త అవతారం ఎత్తాడు. రాబోయే కొత్త తరం క్రికెటర్ల కోసం ధోని కోచ్ గా మారి.. క్రికెట్ పాఠాలు చెప్పాడు. ప్రముఖ క్రికెట్ స్పాన్సర్ మాస్టర్ కార్డు నిర్వహించిన 'క్రికెట్ క్లినిక్-MSD'వర్క్ షాప్ లో పాల్గొన్నాడు ధోని.
మనిషి తాను నేర్చుకున్న విద్యను తన తర్వాత తరానికి కూడా నేర్పించాలి. అప్పుడే అతడికి, అతడు నేర్చుకున్న విద్యకు గౌరవం దక్కుతుంది. ప్రస్తుతం అదే పని చేస్తున్నాడు టీమిండియా మాజీ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని. ప్రముఖ స్పాన్సర్ అయిన మాస్టర్ కార్డు కంపెనీ వారు నిర్వహించిన వర్క్ షాప్ లో తన అనుభవాలను అండర్ -19 మహిళా క్రికెటర్లతో పంచుకున్నాడు. ‘క్రికెట్ క్లినిక్-MSD’పేరుతో నిర్వహించిన వర్క్ షాప్ తో కొన్ని విలువైన చిట్కాలను రాబోయే తరం క్రికెటర్లకు అందించాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
మహేంద్ర సింగ్ ధోని కొచ్ గా కొత్త అవతారం ఎత్తాడు. రాబోయే కొత్త తరం క్రికెటర్ల కోసం ధోని కోచ్ గా మారి.. క్రికెట్ పాఠాలు చెప్పాడు. ప్రముఖ క్రికెట్ స్పాన్సర్ మాస్టర్ కార్డు నిర్వహించిన ‘క్రికెట్ క్లినిక్-MSD’వర్క్ షాప్ లో పాల్గొన్నాడు ధోని. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఔత్సాహిక అండర్-19 మహిళా క్రికెటర్లు ఈ వర్క్ షాప్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ధోని తన విలువైన సలహాలను, సూచనలను వారికి ఇచ్చాడు. మైదానంలో ప్రశాంతంగా ఎలా ఉండాలి, ఒత్తిడిని ఏవిధంగా జయించాలి అన్న అంశాలపై 15 మంది అండర్ -19 మహిళా క్రికెటర్లకు శిక్షణను ఇచ్చాడు.
ఇక ఈ 15 మందిని మాస్టర్ కార్డు సోషల్ మీడియా పోటీ ద్వారా ఎంపిక చేసింది. శారీరక, మానసిక అంశాలపై ధోని సూచనలు చేశాడు. ఇక ఈ కార్యక్రమంలో ధోని మాట్లాడుతూ..”భారతదేశం ప్రపంచ క్రీడా శక్తిగా ఉంది. రోజు రోజుకు మహిళలు క్రీడల్లో దూసుకెళ్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామిగా చేసినందుకు మాస్టర్ కార్డు యాజమాన్యానికి ధన్యవాదాలు. మహిళలను మరింతగా ముందుకు తీసుకెళ్లడానికి నా శక్తిమేర ప్రయత్నిస్తానని” ధోని ఈ సందర్బంగా వ్యాఖ్యానించాడు. మరి ధోని కోచ్ గా మారి మహిళా క్రికెటర్లకు కోచింగ్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#MahendraSinghDhoni trains next generation of women cricketers at ‘Cricket Clinic – MSD’ workshop
Read: https://t.co/0KFYnUhhbP @msdhoni pic.twitter.com/6EXawIkkK5
— Cricket Fanatic (@CricketFanatik) February 21, 2023