ధోని తన సెకండ్ ఇన్నింగ్స్ ని గ్రాండ్ గా మొదలు పెట్టాడు. ఐపీఎల్ కి ఇంకా రిటైర్మెంట్ ప్రకటించకపోయినా నిర్మాతగా బిజీ అయిపోయాడు. కొత్త సినిమా ట్రైలర్ లాంచ్ లో చెన్నైకి తనకు ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ తనదైన కామెడీ టైమింగ్ తో నవ్వించాడు.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూల్ గా ఉండడమే కాదు స్పోర్టివ్ గా ఉంటూ అందరిని తన మాటలతో నవ్విస్తుంటాడు. తనదైన శైలిలో ధోనీ నవ్వించగలడని చాలా కొద్ది మందికే తెలుసు. చాలా ఇంటర్వ్యూల్లో ధోనీ పంచులతో నవ్వించడం మనం చూసే ఉంటాం. అయితే తాజాగా తన మార్క్ కామెడీతో అందరిని పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడు. తన బ్యానర్ లో ప్రస్తుతం ఎల్జీఎం అనే సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో యోగిబాబు కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ లో ధోనీ పాల్గొని సినిమా గురించి మాట్లాడాడు. పనిలో పనిగా కమెడియన్ యోగిబాబు మీద పంచ్ లు వేసి నవ్వించాడు.
ధోని తన సెకండ్ ఇన్నింగ్స్ ని గ్రాండ్ గా మొదలు పెట్టాడు. ఐపీఎల్ కి ఇంకా రిటైర్మెంట్ ప్రకటించకపోయినా ఇప్పటి నుంచే ఒక కొత్త ప్లాన్ తో ముందుకొచ్చాడు. ఎల్జీఎం అనే సినిమా సినిమా నిర్మిస్తూ నిర్మాతగా మారిపోయాడు. ఇక తాజాగా జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకలో చెన్నై గురించి తన అనుబంధాన్ని తెలియజేశాడు. నా ఫస్ట్ మ్యాచ్, టెస్టుల్లో నా హైయెస్ట్ స్కోర్ నా ఫస్ట్ ఫిల్మ్ ప్రొడక్షన్ ఇక్కడే జరిగింది. ఇక ఐపీఎల్ లో నాపై చూపించిన అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను అని తెలిపాడు. ఇక ఈ మీటింగ్ లో కీలక పాత్ర పోషించిన కమెడియన్ యోగి బాబు ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున క్రికెట్ ఆడాలని ఉందని చెప్పాడు. దీనికి ధోనీ చాల ఫన్నీగా రియాక్టవడం వైరల్ గా మారింది.
చెన్నై మిడిల్ ఆర్డర్ లో ఒక ప్లేస్ ఖాళీగా ఉంది. రాయుడు రిటైర్ అయ్యాడు కదా ఆ ప్లేస్ లో నువ్వు ఆడొచ్చు అని కామెడీ రిప్లై ఇచ్చాడు. నేను నా టీం మేనేజ్మెంట్ తో మాట్లాడతా. కానీ నువ్వు సినిమాల్లో మరీ బిజీగా ఉన్నావు కదా. ముందే చెబుతున్న నా టీంలో నిలకడగా రాణించాల్సి ఉంటుంది. లేకపోతే జట్టులో స్థానం దొరకదు. మరొక విషయం గుర్తు పెట్టుకో బౌలర్లు చాల ఫాస్ట్ గా బౌలింగ్ చేస్తారు. నిన్ను మంచాన పడేయాలని చూస్తారు. అని ధోనీ చేసిన వ్యాఖ్యలకు అందరూ పడి పడి నవ్వుకున్నారు. అలాగే భార్యల గురించి మాట్లాడిన ధోనీ .. మీలో ఎంత మందికి పెళ్లిళ్లు అయిపోయాయి? అయితే ఇంట్లో బాస్ ఎవరో అందరికీ తెలిసే ఉండాలి కదా’ అంటూ చెప్పిన ఈ మాటలకి ధోనీ భార్య సాక్షి కూడా నవ్వేసింది. ఇది చూసిన నెటిజన్స్ ధోనీ కామిక్ సెన్స్ చూసి మురిసిపోతున్నారు. మొత్తానికి ట్రైలర్ లాంచ్ లో ధోనీ చేసిన కామెడీ అందరిని నవ్వించడం మేకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
MS Dhoni gives an epic reply as Tamil actor Yogi Babu asks to hire him for CSK.#MSDhoni #YogiBabu #Tamilnadu #Chennai #FILM #Cricket #CricketTwitter #News #NewsUpdate #Sports #SportsNews pic.twitter.com/C0x5agnFQS
— CricInformer (@CricInformer) July 11, 2023