ప్రస్తుతం ఇంగ్లాండ్ లో విటాలిటీ బ్లాస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నిన్న నాటింగ్‌హామ్ షైర్, లీసెస్టర్ షైర్ జట్ల మధ్య మ్యాచు జరిగింది.అయితే లీసెస్టర్ షైర్ బ్యాటింగ్ సమయంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది.
దురదృష్టం వెక్కిరిస్తే ఎంతటి టాప్ బ్యాటర్ అయినా పెవిలియన్ కి చేరాల్సిందే. బౌలర్లు ఎంత ప్రయత్నించినా అవుట్ కాని బ్యాటర్లు కొన్ని సార్లు తమ స్వంత తప్పిదం వలన సెల్ఫ్ అవుట్ అవుతూ ఉంటారు. ఇలాంటి ఎన్నో సంఘటనలు క్రికెట్ లో చోటు చేసుకున్నాయి. అంతే కాదు మన్కడింగ్, స్ట్రైకింగ్ లో ఉన్న బ్యాటర్ వలన నాన్ స్ట్రైకర్ రన్ అవుట్ అవ్వడం, బ్యాట్ తగిలి ఆ తర్వాత ఉహించని రీతిలో వికెట్లను తాకడం, షార్ట్ లెగ్ లో ఫీల్డర్ షూ ని తాకి అనుకోకుండా క్యాచ్ పట్టినప్పుడు లాంటి ఎన్నో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు బ్యాటర్ కి నిరాశ తప్పదు. అయితే వాటన్నింటికీ మించి ఒక బ్యాటర్ కి బ్యాడ్ లక్ వెంటాడింది. ఇక పూర్తి వివరాల్లోకెళ్తే..
ప్రస్తుతం ఇంగ్లాండ్ లో విటాలిటీ బ్లాస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నిన్న నాటింగ్‌హామ్ షైర్, లీసెస్టర్ షైర్ జట్ల మధ్య మ్యాచు జరిగింది.అయితే లీసెస్టర్ షైర్ బ్యాటింగ్ సమయంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఇన్నింగ్స్ 13 వ ఓవర్‌ను నాటింగ్‌హామ్ షైర్ బౌలర్ స్టీవెన్ ముల్లానీ వేశాడు. తొలి బంతికి కెప్టెన్ ఆకేరు మన్ బంతిని నేరుగా కొట్టాడు. అయితే బౌలర్ కి కాస్త దూరంగా వెళ్లిన ఈ బంతిని క్యాచ్ పట్టుకోవడానికి బౌలర్ ప్రయత్నించాడు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. బౌలర్ చేతి నుంచి చేజారిన బంతి కిందపడేది. కానీ బ్యాటర్ దురదృష్టం ఏమో గాని ఆ బంతి నాన్ స్ట్రైకింగ్ బ్యాటర్ కి తగిలి మళ్ళీ వెళ్లి బౌలర్ చేతిలో పడింది.
బంతి వస్తున్నప్పుడే కొంచెం పక్కకు జరిగి ఉంటే బ్యాటర్ ఔటయ్యే ప్రమాదం నుండి తప్పించుకునేవాడు. కానీ అలా జరగలేదు. దీంతో బ్యాటర్ ఆకేరు మన్ నాన్ స్ట్రైకింగ్ లో ఉన్న మల్డర్ వైపు అలాగే చూసాడు. ప్రస్తుతం ఈ రియాక్షన్ వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన వీడియోని విటాలిటీ బ్లాస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. మీరెప్పుడైనా ఇలాంట్ ఔట్ చూశారా అని క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఈ మ్యాచులో వీరి టీం 22 పరుగుల తేడాతో ఒడిపోయింది. మొత్తానికి ఒక బ్యాటర్ బ్యాడ్ లక్ ఇలా కూడా వెంటాడుతుందా అనే రీతిలో ఔటయ్యాడు. మరి ఈ క్యాచ్ మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.