దుబాయ్ వేదికగా జరుగుతున్న అండర్ 19 ఆసియా కప్‌లో టీమిండియా అదరగొడుతుంది. గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో సెమీఫైనల్‌లో 103 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ఈ విజయంలో గుంటూరు కుర్రాడు షేక్ రషీద్ 90 పరుగులతో రాణించాడు. టీమిండియా ఇన్నింగ్స్‌లో రషీద్ చేసిన 90 పరుగుల కీలకంగా మారాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా.. భారత్‌ను మొదట బ్యాటింగ్ ఆహ్వానించింది.
నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 243 పరుగుల చేసింది. 244 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌ను టీమిండియా బౌలర్లు 140 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో భారత్ అండర్ 19 ఆసియా కప్ 2021 ఫైనల్‌కు చేరింది. శుక్రవారం శ్రీలంక, భారత్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మరి గుంటూరు కుర్రాడు రషీద్ ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
More merry news from the U-19 Squad! 😍 #TeamIndia steps into the finals! 💪🏻🥳#U19AsiaCup #WhistlePodu 🦁💛
📷: @BCCI pic.twitter.com/zRLbFsWYTy— Chennai Super Kings – Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) December 30, 2021