సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న భారత-ఏ జట్టులో కరోనా ఓమిక్రాన్ వేరియంట్ కలకలం రేపింది. జట్టు కోచింగ్ సిబ్బందిలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సమాచారం. ఫాంటేన్ వేదికగా భారత-ఏ, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న చివరి నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఆటగాళ్లందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో తొలుత ఇద్దరు టీమిండియా కోచ్‌లకు కోవిడ్ ఓమిక్రాన్ వేరియంట్ పాజిటివ్‌గా తేలి, రెండోసారి జరిపిన పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది.
ప్రాథమిక పరీక్ష ఫలితాలు తప్పుగా వచ్చినట్లు క్రికెట్ దక్షిణాఫ్రికా చీఫ్ మెడికల్ ఆఫీసర్ నిర్ధారించినట్లు సమాచారం. కాగా ఈ విషయం తెలిసి త్వరలో దక్షిణాఫ్రికాలో పర్యటించాల్సిన టీమిండియా ప్లేయర్లు ఆందోళన చెందుతున్నారు. దీంతో సౌతాఫ్రికా టూర్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పర్యటనను రద్దు చేసుకోవడమే మంచిదని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు.