టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి కరోనా సోకిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయనకు కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ నిర్ధారణ పరీక్ష నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. దీంతో వైద్యులు దాదాను ఇంట్లో ఉంచి వైద్యం అందించాలని నిర్ణయించాడు. ప్రస్తుతం గంగూలీ స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నట్లు సమాచారం.
2 రోజుల పాటు కోల్‌కత్తా ఆస్పత్రిలో చికిత్స పొందిన గంగూలీ.. ప్రస్తుతం ఇంటికి చేరుకున్నారు. కాగా ఈ ఏడాది జనవరిలో దాదాకు గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే. మళ్లీ కరోనా సోకడంతో కుటుంబసభ్యుటు, ఆయన అభిమానులు ఆందోళన చెందారు. కాగా సమస్యతో పోరాటం దాదా రక్తంలోనే ఉందని ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సందర్భంగా దాదా అభిమానులు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. మరి దాదా కోలుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The Board of Control for Cricket in India (@BCCI) president #SouravGanguly (@SGanguly99) was on Friday discharged from hospital here after testing negative for the new variant of #COVID19, #Omicron. pic.twitter.com/e0SJhDnv8o
— IANS Tweets (@ians_india) December 31, 2021