ప్రపంచ చెస్ అనగానే అందరికి గుర్తుకు వచ్చే వారిలో ప్రముఖుడు మాగ్నస్ కార్ల్ సన్. చెస్ టోర్నీ ఏదైనా ఇతడు మిగిలిన ప్లేయర్స్ పై సునాయసం విజయం సాధిస్తాడు. అతి చిన్న వయస్సులో ప్రపంచ చెస్ టైటిల్ ని గెలుచి రికార్డు సృష్టించాడు. అలాంటి వ్యక్తిని.. ఓడించి భారత టీనేజి గ్రాండ్ మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద అద్భుత విజయాన్ని అందుకున్నాడు. ఈ విజయంతో 16 ఏళ్ల ప్రజ్ఞానంద ప్రపంచ చెస్ చరిత్రలో గొప్ప విజయాన్ని నమోదు చేశాడు. ఎయిర్ థింగ్స్ మాస్టర్స్ చెస్ టోర్నీలో భాగంగా జరిగిన ఈ పోటీలో మాగ్నస్ కార్ల్ సన్ ను ప్రజ్ఞానంద కంగుతినిపించాడు.
ఈ టోర్నీలో ప్రజ్ఞానంద 8వ రౌండు పోరులో కార్ల్ సన్ ను ఓడించాడు. నల్లపావులతో ఆడిన ప్రజ్ఞానంద 39 ఎత్తుల్లోనే నార్వే దిగ్గజం కార్ల్ సన్ ఆట కట్టించాడు. ఇది ఆన్ లైన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్.ఈ టోర్నీలో ఇప్పటి వరకు మూడు వరుస విజయలతో ఊపుమీద క్లార్ సన్ ఉన్నాడు. ప్రజ్ఞానందతో జరిగే గేమ్ నల్లేరుపై నడకేనని విశ్లేషకులు అంచన వేశారు. అయితే వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ భారత యువ చెస్ ప్లేయర్ ప్రజ్ఞానంద.. తన అమోఘమైన మేధాశక్తితో క్లార్ సన్ జోరుకు బ్రేక్ లు వేశాడు.
ప్రస్తుతం ఈ టోర్నీలో ఈ భారత యువ చేస్ ప్లేయర్ 8 పాయిట్లతో 12వ స్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో లెవ్ అరోనియన్పై మాత్రమే ప్రజ్ఞానంద విజయాన్ని నమోదు చేశాడు. అనీష్ గిరి, క్వాంగ్ లిమ్ లతో జరిగిన మ్యాచ్ లను డ్రా చేసుకున్నాడు. అయితే ఎరిక్ హాన్సెన్, డింగ్ లిరెన్, జాన్ క్రిజ్టోఫ్ డుడా, షఖ్రియార్ మమెద్యరోవ్ చేతిలో ఓడిపోయాడు. మరి.. క్లార్ సన్ ను ఓడించి.. అద్భుత విజయం అందుకున్న ప్రజ్ఞానంద పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.