ఆడింది 6 టెస్టులో వికెట్లు మాత్రం 42. ఇందులో 5 సార్లు 5 వికెట్ల ఘనత. శ్రీలంక ఆల్ టైం బెస్ట్ స్పిన్నర్, ప్రపంచంలోనే బెస్ట్ ఆఫ్ స్పిన్నర్ మురళి ధరన్ కి కూడా ఈ రికార్డ్ సాధ్యం కాలేదు. కానీ అతడికే సాధ్యమైంది. ఇంతకీ ఆ స్పిన్నర్ ఎవరు ?
సాధారణంగా శ్రీలంక జట్టుకి స్పిన్నర్ల విషయంలో ఎలాంటి లోటు ఉండదు. ఇందులో భాగంగా..ప్రస్తుతం ఒక స్పిన్నర్ దుమ్ము లేపుతున్నాడు. నేను బౌలింగ్ వేస్తే 5 వికెట్లు కావాలి అంటున్నాడు. వికెట్ తీసినంత సింపుల్ గా 5 వికెట్ల ప్రదర్శన చేస్తున్నాడు ఈ నయా సంచలనం. ఈ గణాంకాలతో శ్రీలంక ఆల్ టైం బెస్ట్ స్పిన్నర్, ప్రపంచంలోనే బెస్ట్ ఆఫ్ స్పిన్నర్ మురళి ధరన్నీ గుర్తు చేస్తున్నాడు. ఆడింది 10 టెస్టులు కూడా లేవు వచ్చి ఏడాది కూడా కాలేదు. అప్పుడే తన బౌలింగ్ తో ఔరా అనిపిస్తున్నాడు. అతడే ప్రస్తుత శ్రీలంక జట్టులో సత్తా చాటుతున్న ప్రభాత్ జయసూరియా. అతడి గురించి ప్రపంచానికి పెద్దగా తెలియకపోయినా.. ఈ స్పిన్నర్ గణాంకాలు చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే.
శ్రీలంక నయా సంచలనం ప్రభాత్ జయసూరియా ఇప్పుడు రికార్డులు సెట్ చేసే పనిలో ఉన్నాడు. గతేడాది ఆస్ట్రేలియాతో గాలే టెస్టుల్లో అరంగ్రేటం చేసాడు ఈ లెఫ్ట్ ఆర్మర్. ఈ సిరీస్ లో ఆస్ట్రేలియాను వణికించిన ప్రభాత్ .. ఆ తర్వాత పాకిస్థాన్ సిరీస్ లో కూడా తన బౌలింగ్ తో ముప్పుతిప్పలు పెట్టాడు. ఇప్పటివరకు ఆడింది 6 టెస్టులో అయినా 5 సార్లు 5 వికెట్లు పడేసి సంచలనం సృష్టించాడు. 31 ఏళ్ళ వయసులో వచ్చినా కూడా ప్రస్తుతం తన స్పిన్ మాయాజాలంతో అన్ని జట్లను హడలెత్తిస్తున్నాడు. మొత్తం ఇప్పటివరకు 11 ఇన్నింగ్స్ లో 42 వికెట్లు తీసిన ఈ మిస్టరీ స్పిన్నర్ సగటు కేవలం 21 మాత్రమే. దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు అతను ప్రత్యర్థుల పాలిట ఎంత సింహ స్వప్నంలా మారాడో చెప్పడానికి.
ఆస్ట్రేలియా, పాకిస్థాన్ సిరీస్ లో రాణించిన జయసూరియా ప్రస్తుతం ఐర్లాండ్ సిరీస్ లో కూడా 5 వికెట్ల ప్రదర్శన చేసాడు. ఈ క్రమంలో అతి తక్కువ టెస్టుల్లో 5 సార్లు 5 వికెట్లు అందుకున్న మూడో బౌలర్ గా నిలిచాడు. ఈ జాబితాలో ఆసీస్ బౌలర్ రాడ్ నీ హాగ్ 3 టెస్టుల్లో ఈ ఘనత సాధించి మొదటి స్థానంలో నిలవగా.. ఇంగ్లాండ్ టామ్ రిచర్డ్సన్ 4 టెస్టుల్లో 5 వికెట్లను 5 సార్లు పడగొట్టి రెండో స్థానంలో నిలిచాడు. అయితే.. శ్రీలంక తరపున మాత్రం జయసూరియానే టాప్ లో కొనసాగుతున్నాడు. లెజెండరీ స్పిన్నర్ మురళీ ధరన్ కి సాధ్యం కాని ఘనతను ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సాధించాడు. దీంతో భవిష్యత్తులో జయసూరియా మరెన్ని రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
Sri Lanka are in a commanding position after the end of Day 2 🏏💪 Prabath Jayasuriya takes 5️⃣ wickets! 🙌
Ireland trail by 474 runs.#SLvIRE #LionsRoar pic.twitter.com/jHFIibo38r
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) April 17, 2023