ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్, బౌలింగ్ లో మాత్రమే కాదు కెప్టెన్ గాను అదరగొడుతున్నాడు. తొలి రెండు టెస్టులు ఇంగ్లాండ్ ఓడిపోనప్పటికీ స్టోక్స్ కెప్టెన్సీ ఆకట్టుకుంది. ఈ విజయంతో ఒక అరుదైన రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ జట్టు అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చింది. తొలి రెండు టెస్టులు ఓడిపోయిన ఏ మాత్రం ఆత్మస్థైర్యం చెరిగిపోకుండా సమిష్టిగా రాణించింది. లీడ్స్ లో జరిగిన ఈ టెస్టు మ్యాచులో మూడు వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. దీంతో మూడింట మ్యాచుల యాషెస్ సిరీస్ లో ఆసీస్ ఆధిక్యాన్ని 2-1 కి తగ్గించింది. నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ ఓ వైపు వికెట్లు పడుతున్న ఆ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ బ్రూక్ 75 పరుగులతో రాణించాడు. చివర్లో ఉత్కంఠ నెలకొన్న వోక్స్ (32) మార్క్ వుడ్(16) ఆసీస్ బౌలర్లను అలవోకగా ఆడేశారు. ఈ విజయంతో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఒక అరుదైన రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్, బౌలింగ్ లో మాత్రమే కాదు కెప్టెన్ గాను అదరగొడుతున్నాడు. తొలి రెండు టెస్టులు ఇంగ్లాండ్ ఓడిపోనప్పటికీ స్టోక్స్ కెప్టెన్సీ ఆకట్టుకుంది. ముఖ్యంగా స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖవాజాకి సెట్ చేసిన ఫీల్డింగ్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. బజ్ బాల్ అంటూ ఇంగ్లాండ్ కి ఒక కొత్తరకం ఫార్ములా కనిపెట్టి గెలవడం ఎలాగో నేర్పించాడు. ప్రస్తుతం యాషెస్ లో తొలి రెండు టెస్టులు ఓడిపోయినప్పటికీ మూడో టెస్టు విజయంతో తన కెప్టెన్సీ రికార్డ్ ని మెరుగుపర్చుకున్నాడు. లీడ్స్ టెస్టు గెలవడం ద్వారా 250 అంతకంటే ఎక్కువ మ్యాచులు గెలిపించిన ఆటగాడిగా స్టోక్స్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు స్టోక్స్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ 5 సార్లు 250 కి పైగా ఛేజ్ చేసింది.
ఈ రికార్డ్ ఇప్పటివరకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉంది. ధోని కెప్టెన్సీలో టీమిండియా ఇప్పటివరకు 4 సార్లు ఈ ఫీట్ సాధించింది. ఇక దిగ్గజ కెప్టెన్లు పాంటింగ్, లారా కూడా 3 సార్లు ఈ ఘనత సాధించి స్టోక్స్, ధోనీ తర్వాత స్థానాల్లో నిలిచారు. ఇక బ్యాటింగ్ లో కూడా అదరగొడుతున్న స్టోక్స్ లార్డ్స్ టెస్టులో 155 పరుగుల ఆసాధారణ ఇన్నింగ్స్ తో జట్టుని గెలిపించినత పని చేసిన స్టోక్స్.. మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో 80 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక ఈ మ్యాచులో సహచరుడు హ్యారీ బ్రూక్ బంతుల పరంగా అత్యధిక వేగంగా 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. బ్రూక్ 1000 పరుగులు చేయడానికి కేవలం 1058 బంతులు మాత్రమే అవసరమయ్యాయి. మొత్తానికి ధోనీ రికార్డ్ స్టోక్స్ బ్రేక్ చేయడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.