కొడుకు పుట్టినప్పుడు కాదు.. ప్రయోజకుడు అయినప్పుడు తండ్రి పుత్రోత్సాహం పొందుతాడనే నానుడి ఉంది. ప్రస్తుతం ఈ అనుభూతిని టీమిండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ అనుభవిస్తున్నాడు. క్రికెట్‌కు ఎప్పుడో వీడ్కోలు పలికిన అజహరుద్దీన్ ఆ తర్వాత పాలిటిక్స్‌లో బిజీ అయ్యాడు. తాజాగా యూఏఈలో ఫ్రెండ్‌షిప్ కప్‌లో ఆడుతున్న అజహర్ ఇండియా లెజెండ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కాగా పాకిస్థాన్ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన కుమారుడు మొహమ్మద్ అసదుద్దీన్‌తో కలిసి అజహరుద్దీన్ బ్యాటింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో చూడచక్కటి షాట్లలో అసద్ ఆకట్టుకున్నాడు.
కుమారుడితో కలిసి బ్యాటింగ్ పార్టనర్‌గా ఆడిన వీడియోను అజహర్ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేస్తు భావోద్వేగానికి లోనైనట్లు తెలుస్తుంది. ‘నా కొడుకుతో కలిసి పిచ్ పంచుకోవడం.. చాలా స్పెషల్ మొమెంట్, నా పేరు పక్కన అసద్ పేరు చూసుకోవడం గర్వంగా ఉంది’ అంటూ అజహర్ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో అసద్ 22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 45 పరుగులు చేశాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: అజారుద్దీన్ పై వేటు పడింది
It’s a special moment when you share the pitch with your son. Proud moment to see Asad’s name along with mine on the same screen.#FriendshipCupUAE2022 where Abbas played exemplary cricket scoring some big runs at Sharjah stadium. pic.twitter.com/YJeu7IIttK
— Mohammed Azharuddin (@azharflicks) March 8, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.