క్రికెట్‌లో రనౌట్‌లు జరగడం అనేది సహజం. కానీ ఆండ్రీ రస్సెల్ అసాధారణ రీతిలో రనౌట్ అయ్యాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపిఎల్) లో భాగంగా ఖుల్నా టైగర్స్, మినిస్టర్ గ్రూప్ ఢాకా మధ్య జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ ఎవరూ ఊహించని విధంగా రనౌట్ అయ్యి చరిత్రలో నిలిచిపోయాడు.
That’s why they say, always keep your eyes on the ball!
One of the strangest run-out dismissals ever seen!
Andre Russell at the receiving end of it!#BPL #AndreRussellpic.twitter.com/erOZl2xnvn— OneCricket (@OneCricketApp) January 21, 2022
మ్యాచ్ 15వ ఓవర్ చివరి బంతిని షార్ట్ థర్డ్ మ్యాన్ వైపు ఆడిన రస్సెల్ పరుగు కోసం పిలిచాడు. బంతిని అందుకున్న ఫీల్డర్ స్ట్రైకర్ ఎండ్ వైపు బంతిని విసరడంతో అది స్టంప్‌లను తాకింది. అటునుంచి నేరుగా బంతి నాన్ స్ట్రైక్ ఎండ్ వైపు దూసుకెళ్లి నాన్-స్ట్రైకర్ ఎండ్‌లోని స్టంప్‌లను కూడా తాకింది. రస్సెల్ నాన్ స్ట్రైక్ ఎండ్ వైపు క్రీజులోకి చేరుకోకపోవడంతో రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. తాను ఔటైన తీరుపై నవ్వాలో.. ఏడ్వాలో తెలియక ఆకాశం వైపు చూస్తూ పెవిలియన్ బాట పట్టాడు.
ఇక మ్యాచ్ ఫలితానికొస్తే ఈ మ్యాచ్ లో మినిస్టర్ గ్రూప్ ఢాకాపై.. ఖుల్నా టైగర్స్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన మినిస్టర్ గ్రూప్ మహ్మద్ షాజాద్, తమీమ్, మహ్మదుల్లా రాణించడంతో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. అయితే ఖుల్నా టైగర్స్ 19 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
అయితే ఈ రనౌట్ పై అభిమానులు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఎప్పుడూ బంతిపైనే దృష్టి పెట్టాలని కొందరు అంటుండగా, ఇలాంటి రూల్స్ ని చేయాలంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.