‘క్యాచెస్ విన్ మ్యాచెస్’ అనే నానుడి క్రికెట్లో బాగా వినపడుతుంది. బౌలింగ్, బ్యాటింగ్‌తో పాటు మ్యాచ్‌లు గెలవడంలో ఫీల్డింగ్ కూడా ఇప్పుడు కీలకంగా మారింది.
క్రికెట్లో ఫీల్డింగ్ ప్రమాణాలు మునుపటి కంటే బాగా పెరిగాయి. టీ20 ఫార్మాట్‌కు క్రేజ్ పెరగడంతో బౌలింగ్, బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లో మెరుగుపడటం తప్పనిసరిగా మారింది. ఒకప్పుడు ఫీల్డింగ్‌ను చాలా మంది ప్లేయర్లు తేలిగ్గా తీసుకునేవారు. ప్రతి జట్టులో ఒకరిద్దరు ప్లేయర్లు తప్పితే గొప్పగా ఫీల్డింగ్ చేసేవారు ఉండేవారు కాదు. కానీ టీ20 మ్యాచుల్లో ప్రతి క్యాచ్ కూడా ఎంతో విలువైనదిగా మారింది. ఈ ఫార్మాట్లో ఒక్క క్యాచ్, ఒక్క వికెట్‌తో మ్యాచ్ స్వరూపమే మారిపోతోంది. దీంతో అన్ని జట్లు ఫీల్డింగ్ మెరుగుపర్చుకోవడంపై దృష్టి సారించాయి. అందుకే గత కొన్నేళ్లుగా టీ20తో పాటు వన్డేలు, టెస్టుల్లోనూ ఆటగాళ్ల నుంచి ఫీల్డింగ్‌లో మెరుపులను చూస్తున్నాం.
తాజాగా ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు ఆండ్రీ రస్సెస్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రస్సెల్.. సూపర్ డైవ్ క్యాచ్‌తో అందర్నీ ఆకట్టుకున్నాడు. అసాధారణ క్యాచ్‌తో ఎస్ఆర్హెచ్ ఓపెనర్ అభిషేక్ శర్మ (9)ను పెవిలియన్‌కు పంపాడు రస్సెల్. అభిషేక్ కొట్టిన బాల్ చాలా ఎత్తుకు వెళ్లింది. అయితే చివరి వరకు బాల్‌పై దృష్టి మరల్చని రస్సెల్ అద్భుతంగా దాన్ని ఒడిసిపట్టుకున్నాడు. సూపర్ మ్యాన్ తరహాలో గాల్లో ఎగురుతూ క్యాచ్ అందుకున్నాడు. దీంతో అభిషేక్ శర్మ బిత్తరపోయాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇకపోతే, ఈ మ్యాచ్‌లో కేకేఆర్ గెలుపొందింది. ఆ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 171 రన్స్ చేయగా.. ఛేదనలో ఎస్ఆర్హెచ్ 166 రన్స్ మాత్రమే చేసి ఓడిపోయింది.
Big Dre Russ dives and takes a blinder of a catch 🤯#IPLonJioCinema #TATAIPL #IPL2023 | @KKRiders @Russell12A pic.twitter.com/iEhmyCZBuJ
— JioCinema (@JioCinema) May 4, 2023