ఓటీటీలో సినిమాలు చూడటం మీకు బాగా అలవాటా? అయితే ఈ స్టోరీ మీకోసమే. ఈ వీకెండ్ ఏకంగా 25 కొత్త సినిమాలు మిమ్మల్ని ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అయిపోయాయి. అవేంటో చూసేద్దామా?
వీకెండ్ లో మీరేం చేస్తారు? అని అడిగితే ట్రిప్స్ కి వెళ్తామని కొందరు, ఇంట్లో కూర్చుని మూవీస్/ సిరీసులు చూస్తామని మరికొందరు చెబుతారు. ఎవరికి వారు తమకు నచ్చింది చేస్తూ ఉంటారు. వీళ్లలో చాలావరకు బయటకు వెళ్లి తిరగడం కంటే.. ఓటీటీలో వచ్చిన కొత్త సినిమాలు చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అలాంటి వాళ్లకోసమే అన్నట్లు.. ఆయా ఓటీటీ సంస్థల్ని ప్రతివారం కొత్త కొత్త మూవీస్ తో ప్రేక్షకుల ముందుకొచ్చేస్తుంటాయి. అలా ఈ వీకెండ్ కి ఏకంగా 25 న్యూ సినిమాస్ ని రిలీజ్ చేసేందుకు రెడీ అయిపోయాయి.
ఇక విషయానికొస్తే.. ఈ వారాంతంలో మీకోసం ఏకంగా 25 కొత్త సినిమాలు వస్తున్నాయి. అందులో కొన్ని ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతుండగా, మరికొన్ని శుక్రవారం.. ఓటీటీల్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ లిస్టులో చాలావరకు హిందీ-ఇంగ్లీష్ సినిమాలు/సిరీసులే ఎక్కువగా ఉన్నాయి. తెలుగు నుంచి సొహైల్ నటించిన ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’ మూవీ మాత్రమే ఉంది. అయితే ఇతర భాషల్లోని సినిమాలు/సిరీసులు కూడా కాస్త ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. మరి ఇందులో మీ ఛాయిస్ ఏది? ఏ మూవీ చూసేందుకు రెడీ అవుతున్నారు.