తెలంగాణలో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. అలాగే కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశముంది. ఈ మేరకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ని జారీ చేసింది.
వర్షాలు కురిసినప్పుడు యే ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ వార్నింగ్స్ ఇస్తుంటుంది వాతావరణ శాఖ. అసలేంటా రంగులు, ఏ రంగు దేనికి దేనికి సూచన, మనం ఏ రంగు వార్నింగ్ వచ్చినప్పుడు అప్రమత్తమవ్వాలి? వాతావరణ పరిస్థితుల తీవ్రతను తెలియజేయడానికి భారత వాతావరణ శాఖ (IMD) రంగుల విధానాన్ని ప్రవేశపెట్టింది. విపత్తు నిర్వహణ శాఖ వీటిని ప్రకటిస్తుంది. ఇలా రంగుల రూపంలో చెబితే ఎక్కువమందికి సులభంగా విషయం అర్థమవుతుందనేది దీని ఉద్దేశం. దానికి తగ్గట్టుగా తర్వాతి పరిస్థితిని అర్థం చేసుకొని అవసరమైన చర్యలు తీసుకోవచ్చు. తొలి రోజుల్లో ఆకుపచ్చ రంగు, పసుపు, నారిజం, ఎరుపు అంటూ నాలుగు రకాల రంగులు వాడేవారు. ఆకుపచ్చ అంటే ఎలాంటి చర్యలు అవసరం లేదని, పసుపు అంటే సిద్ధంగా ఉండమని, నారింజ అంటే సంసిద్ధులుకండి అని, ఎరుపు అంటే చర్యలు తీసుకోమని అర్థం.
తెలంగాణలో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. అలాగే కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశముంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఎల్లో అలర్ట్ ని జారీ చేసింది. కాగా తెలంగాణలో తేలికపాటి ఒక మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ , ములుగు, భద్రాద్రి కొత్త గూడెం,ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడనుందని సమాచారం.
అలాగే కుమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీం నగర్, ములుగు, పెద్దపల్లి, భద్రాద్రి గూడెం, ఖమ్మం జిల్లాలో వడ గాడ్పులు వేస్తాయని హెచ్చరించింది. మంగళవారం నుంచి బుధవారం వరకు వికారాబాద్, సంగతి రెడ్డి, మెదక్, కామా రెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గధ్వల లో ఉరుములు, మెరుపులు గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.