తెలంగాణలో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. అలాగే కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశముంది. ఈ మేరకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ని జారీ చేసింది.
దేశంలో కొన్ని రోజులుగా కరోనా కొత్త రూపం ఒమిక్రాన్ వేరియంట్ అనూహ్య రీతిలో విజృంభిస్తుంది. ఈ నెల మొదటి వారంలో పదుల సంఖ్యలో ఉన్న కేసులు ఇప్పుడు వందలు దాటాయి. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 600 దాటింది. ఈ కేసులు ఎక్కువగా ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, రాజస్థాన్, తెలంగాణలో ఉన్నాయి. ఈ విషయంలో కేంద్రం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది. ఎన్నడూ లేని విధంగా సోమవారం ఒక్కరోజే ఢిల్లీలో 331 కేసులు వెలుగు చూశాయి. […]